తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో రెండో రోజు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ, మంత్రి కేటీఆర్ మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. సభలో ఎమ్మెల్యే అక్బరుద్దీన్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఉర్దూను రెండో అధికార భాషగా ప్రకటించినప్పటికీ దానికి తగిన న్యాయం చేయడం లేదని విమర్శించారు. తెలంగాణ సచివాలయంలో మసీదు నిర్మాణం పరిస్థితి, హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రి పరిస్థితులను కూడా ఆయన అడిగి తెలుసుకున్నారు. హైటెక్ సిటీలో శరవేగంగా అభివృద్ధి జరుగుతున్నా పాతబస్తీలో మాత్రం అభివృద్ధి జరగకపోవడంపై ఎమ్మెల్యే ప్రశ్నించారు. చార్మినార్ పాదచారుల ప్రాజెక్టు, హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టుల పూర్తి తేదీపై కూడా ఆయన వివరణ కోరారు. సీఎం కేసీఆర్, ఇతర మంత్రులను కలవడానికి అనుమతించడం లేదని ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఆరోపిస్తూ, తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం కిందిస్థాయి సిబ్బందిని కూడా కలవడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. అక్బరుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలకు, మంత్రి కేటీఆర్ ఘాటుగా బదులిచ్చారు.
Also Read : Revanth Reddy : 2003 నాటి పరిస్థితులు.. ఇప్పుడు మళ్లీ మొదటికి వచ్చింది
ఎంఐఎం ఎమ్మెల్యేలు ఉన్నదే ఏడుగురని, వారికి అధిక సమయం కేటాయించరని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించడం తెలిసిందే. దీనిపై అక్బరుద్దీన్ ఒవైసీ కౌంటర్ ఇచ్చారు. ఏడుగురు ఎమ్మెల్యేలే ఉన్నారని కేటీఆర్ అన్నారని, దీన్ని తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని, తమ పార్టీ అధినేత అంగీకరిస్తే వచ్చే ఎన్నికల్లో 50 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించారు అక్బరుద్దీన్. దీనిపై తాను పార్టీ చీఫ్ తో మాట్లాడతానని వెల్లడించారు అక్బరుద్దీన్. ఏడుగురు కాదు కనీసం 15 మంది ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యేలా చూస్తామని, ఈసారి మరింతమంది ఎమ్మెల్యేలతో సభలో అడుగుపెడతామని అక్బరుద్దీన్ వ్యాఖ్యానించారు.
Also Read : Dadisetti Raja: యనమలకు దాడిశెట్టి సవాల్.. తమ్ముడితో ఆ పని చేయించగలవా?
