NTV Telugu Site icon

Eknath Shinde : అవసరమైతే సుప్రీంకోర్టుకు పోతాం.. కానీ ఒక్క అంగుళం కూడా వదులుకోం

Eknath Shinde

Eknath Shinde

Eknath Shinde : మహారాష్ట్ర, కర్ణాటక మధ్య సరిహద్దు వివాదం రసవత్తరంగా నడుస్తోంది. రాష్ట్రానికి చెందిన ఒక్క అంగుళం భూమిని వదులుకోబోమని అవసరమైతే సుప్రీంకోర్టును, కేంద్రప్రభుత్వాన్ని ఆశ్రయిస్తానని ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే అన్నారు. మహారాష్ట్ర-కర్ణాటక సరిహద్దు వివాదంపై మహారాష్ట్ర శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించిన తీర్మానాన్ని ప్రవేశపెట్టిన ఒక రోజు తర్వాత షిండే ఈ ప్రకటన చేశారు. కర్ణాటకలోని మరాఠీ మాట్లాడే 865 గ్రామాలను మహారాష్ట్రలోకి విలీనం చేయాలని ఈ తీర్మానం కోరుతోంది. బుధవారం మహారాష్ట్ర శాసన మండలిలో షిండే ప్రసంగిస్తూ.. ‘కర్ణాటక మమ్మల్ని సవాలు చేయకూడదని, బెల్గాం, నిపాని, కార్వార్‌, బీదర్‌, భాల్కీ సహా 865 గ్రామాల్లో అంగుళం భూమిని వదులుకోబోం’ అని అన్నారు. మరాఠీ మాట్లాడే ప్రజలకు అన్యాయం జరగకుండా చట్టపరంగా ఎలాంటి చర్యలనైనా తీసుకుంటామని ఆయన తెలిపారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని సుప్రీంకోర్టును అవసరమైతే కేంద్రప్రభుత్వాన్ని కోరుతామని ఏక్ నాథ్ షిండే అన్నారు. శాసనసభ తీర్మానం ప్రకారం, మహారాష్ట్ర ప్రభుత్వం సరిహద్దు ప్రాంతాల్లోని మరాఠీలకు మద్దతుగా నిలుస్తుంది. ఈ ప్రాంతాలు మహారాష్ట్రలో భాగమయ్యేలా సుప్రీంకోర్టులో న్యాయ పోరాటానికి వెళ్తుంది.

Read Also : Cobra Fight : తుపాకీ కాల్పులకు ఎదురుతిరిగిన పాము

ఈ వివాదంపై కర్ణాటక శాసన సభ ఇటీవల ఓ తీర్మానాన్ని ఆమోదించింది. మహారాష్ట్ర ప్రభుత్వం సృష్టించిన సరిహద్దు వివాదాన్ని ఖండించింది. కర్ణాటక భూమి, నీరు, భాష, కన్నడిగుల ప్రయోజనాలకు సంబంధించిన అంశాల్లో ఎటువంటి రాజీ లేదని స్పష్టం చేసింది. ఈ విషయంలో కర్ణాటక ప్రజలు, ఎమ్మెల్యేల భావాలు ఒకటేనని పేర్కొంది. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటం కోసం ఐకమత్యంగా రాజ్యాంగపరమైన, న్యాయపరమైన చర్యలు తీసుకోవడానికి కట్టుబడి ఉన్నట్లు పేర్కొంది. ఈ వివాదంపై సుప్రీంకోర్టు తీర్పును ప్రకటించే వరకు ఇరు రాష్ట్రాలు ఎలాంటి వాదనలు చేయబోవని కేంద్ర హోంమంత్రి అమిత్ షా హామీ ఇచ్చారు. మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే, కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై మధ్య శాంతి నెలకొల్పేందుకు జోక్యం చేసుకోవద్దన్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన చిన్నచిన్న సమస్యలను కర్ణాటకకు చెందిన ముగ్గురు, మహారాష్ట్రకు చెందిన ముగ్గురు మంత్రులు కూర్చుని పరిష్కరిస్తారని కూడా షా చెప్పారు. రెండు రాష్ట్రాల్లో శాంతిభద్రతలను సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి పర్యవేక్షిస్తారని కేంద్ర మంత్రి తెలిపారు.