Site icon NTV Telugu

Womens World Cup Final 2025: గెలుపే టార్గెట్.. మొదట బ్యాటింగ్ చేయనున్న టీమిండియా..!

Womens World Cup Final 2025

Womens World Cup Final 2025

Womens World Cup Final 2025: నవీ ముంబైలోని డీవై పటిల్ స్టేడియంలో జరుగుతున్న మహిళల వన్డే ప్రపంచకప్ 2025 ఫైనల్ మ్యాచ్‌కి వేదిక సిద్ధమైంది. భారత మహిళల జట్టు, దక్షిణాఫ్రికా జట్టు మధ్య తలపడనున్న ఈ మ్యాచ్ చరిత్రాత్మకంగా మారనుంది. ఫైనల్ మ్యాచ్ ముందు భారీ వర్షం కారణంగా ఆట ప్రారంభం ఆలస్యమైంది. టాస్ మధ్యాహ్నం 2.30 గంటలకు జరగాల్సి ఉండగా.. తడిగా మారిన ఔట్‌ఫీల్డ్ కారణంగా దాదాపు రెండు గంటల ఆలస్యంతో టాస్ జరిగింది. చివరికి వర్షం ఆగిన తరువాత దక్షిణాఫ్రికా టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేయాలని నిర్ణయించింది. దీనితో టీమిండియా మొదట బ్యాటింగ్ చేపట్టనుంది.

Australia vs India 3rd T20I: టిమ్ డేవిడ్, స్టోయినిస్ దూకుడు.. టీమిండియా ముందు భారీ టార్గెట్..!

ఫైనల్‌కు ముందు ముంబైలో కురిసిన వర్షం కారణంగా అభిమానులు ఆందోళనలో ఉన్నారు. స్టేడియం ప్రేక్షకులతో కిక్కిరిసిపోయి ఉండగా, మైదానంలో కవర్లు తొలగించబడిన తరువాత టాస్ జరిగింది. ఆట సాయంత్రం 5 గంటలకు మొదలు కానునట్లుగా నిర్ణయించారు. వర్షం మరలా కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో.. 20 ఓవర్ల మ్యాచ్ కూడా జరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. అవసరమైతే మ్యాచ్‌ను రిజర్వ్ డే కి మార్చే అవకాశం ఉంది.

ఇక హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలో భారత మహిళల జట్టు మూడోసారి ప్రపంచకప్ ఫైనల్‌లో ఆడుతోంది. అంతకుముందు 2005, 2017ల్లో ఫైనల్‌కి చేరినప్పటికీ ట్రోఫీ అందుకోలేకపోయింది. ఈసారి మాత్రం చరిత్ర సృష్టించాలని జట్టు లక్ష్యంగా పెట్టుకుంది. సెమీఫైనల్‌లో భారత్ ఆస్ట్రేలియాపై అద్భుత విజయం సాధించి ఫైనల్‌కి చేరింది. ఇక మరోవైపు లౌరా వోల్వార్ట్ నాయకత్వంలోని దక్షిణాఫ్రికా జట్టు మొదటిసారిగా ప్రపంచకప్ ఫైనల్ ఆడుతోంది. సెమీఫైనల్‌లో ఇంగ్లాండ్‌పై గెలిచి చరిత్ర సృష్టించింది. లీగ్ దశలో భారత్‌పై మ్యాచ్‌లో మూడు వికెట్ల తేడాతో విజయం సాధించిన ఆత్మవిశ్వాసంతో ఇప్పుడు టైటిల్ కోసం బరిలోకి దిగింది. ఇక ఇరుజట్ల ప్లేయింగ్ XI ఇలా ఉంది.

Womens World Cup 2025 Final: చరిత్ర సృష్టించేందుకు భారత్, దక్షిణాఫ్రికా జట్లు రెడీ.. మ్యాచ్ కు అడ్డంకిగా మారిన వరణుడు..!

భారత మహిళల జట్టు (Playing XI):
షఫాలీ వర్మ, స్మృతి మంధానా, జెమిమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), అమంజోత్ కౌర్, రాధా యాదవ్, క్రాంతి గౌడ్, శ్రీచరణి, రేణుకా సింగ్ ఠాకూర్

దక్షిణాఫ్రిక మహిళల జట్టు (Playing XI):
లౌరా వోల్వార్ట్ (కెప్టెన్), తజ్మిన్ బ్రిట్స్, అనెకే బోష్, సునే లూస్, మారిజానే క్యాప్, సినాలో జాఫ్టా (వికెట్ కీపర్), అనెరీ డర్క్‌సెన్, క్లోయ్ ట్రయాన్, నాడిన్ డి క్లార్క్, అయాబోంగా ఖాఖా, నోన్కులులెకో మ్లాబా

Exit mobile version