T20 World Cup: టీమిండియా ఘోర ఓటమి.. వరల్డ్ కప్ నుంచి ఔట్..

Womenssss

Womenssss

మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత మహిళల జట్టు ప్రస్థానం ముగిసింది. గ్రూప్-ఎ లో భాగంగా లార్డ్స్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన అత్యంత కీలకమైన లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 6 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. మరోవైపు సెమీస్ రేసులో ఉన్న దక్షిణాఫ్రికా ఇప్పటికే బంగ్లాదేశ్‌పై ఘన విజయం సాధించి సెమీఫైనల్‌కు దూసుకెళ్లడంతో, భారత్ అధికారికంగా టోర్నమెంట్ నుండి అవుట్ అయింది.

కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన హర్మన్‌ప్రీత్
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 170 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్లు స్మృతి మంధాన (38), షెఫాలీ వర్మ (34), జెమీమా రోడ్రిగ్స్ (34)లు జట్టుకు మంచి పునాది వేశారు. అనంతరం కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కేవలం 27 బంతుల్లోనే 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 56 పరుగులు చేసి విధ్వంసకర ఇన్నింగ్స్‌తో రాణించింది.

ఆస్ట్రేలియా విధ్వంసం.. మ్యాచ్ ఫినిష్ చేసిన గార్డనర్
171 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా మహిళల జట్టు కేవలం 19 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేసి విజయం సాధించింది. ఆసీస్ బ్యాటర్లలో ఎల్లీస్ పెర్రీ 38 బంతుల్లో 56 పరుగులు చేయగా, ఆష్లీ గార్డనర్ కేవలం 29 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 53 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచి జట్టుకు విజయాన్ని అందించింది. బెత్ మూనీ (22), ఫోబ్ లిచ్‌ఫీల్డ్ (24) పరుగులు సాధించారు. భారత బౌలర్లలో శ్రీ చరణి 2 వికెట్లు పడగొట్టింది.