NTV Telugu Site icon

Cricket: ఉమెన్స్ టీ20 ప్రపంచకప్‌ 2024 టీమ్‌ ప్రకటన.. ఒక్క భారత క్రీడాకారిణికి చోటు

Harman

Harman

భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అద్భుత బ్యాటింగ్‌తో 2024 మహిళల టీ20 ప్రపంచ కప్‌ ‘టీమ్ ఆఫ్ ద టోర్నమెంట్’లో చోటు దక్కించుకుంది. ఈ ‘టీమ్ ఆఫ్ టోర్నీ’లో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా ఆటగాళ్లు కూడా ఉన్నారు. ఆదివారం జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్ 32 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించి తొలి మహిళల టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. టీ 20 వరల్డ్ కప్‌లో భారత్.. సెమీ-ఫైనల్‌కు చేరుకోపోయినప్పటికీ, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ మాత్రం అద్భుత ప్రదర్శన చేసింది. దీంతో.. ఇండియా టాప్ స్కోరర్‌గా ఉండగా, టోర్నమెంట్‌లో నాల్గవ అత్యధిక స్కోరర్‌గా నిలిచింది. నాలుగు ఇన్నింగ్స్‌ల్లో రెండు అర్ధ సెంచరీలతో 150 పరుగులు చేసింది. ఆమె స్ట్రైక్ రేట్ 133.92. కాగా.. సోమవారం ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) ప్రకటించిన ప్రపంచ జట్టులో ఛాంపియన్ న్యూజిలాండ్ నుంచి ముగ్గురు ఆటగాళ్లు ఉండగా.. రన్నరప్ సౌతాఫ్రికా నుంచి ముగ్గురు ఉన్నారు.

UP: తోడేళ్ల తర్వాత ఏనుగులు, చిరుతపులుల బీభత్సం.. 20 రోజుల్లో ముగ్గురు మృతి

మహిళల T20 ప్రపంచ కప్ 2024 జట్టు:
లారా వోల్వార్డ్ట్ (దక్షిణాఫ్రికా, కెప్టెన్), తజ్మిన్ బ్రిట్స్ (దక్షిణాఫ్రికా), డానీ వాట్ హాడ్జ్ (ఇంగ్లండ్), మెల్లీ కెర్ (న్యూజిలాండ్), హర్మన్‌ప్రీత్ కౌర్ (ఇండియా), డియాండ్రా డాటిన్ (వెస్టిండీస్), నిగర్ సుల్తానా జోతి (బంగ్లాదేశ్, wk), ఎఫీ ఫ్లెచర్ (వెస్టిండీస్), రోజ్మేరీ మేయర్ (న్యూజిలాండ్), నోంకులులెకో మ్లాబా (దక్షిణాఫ్రికా), మేగాన్ షట్ (ఆస్ట్రేలియా). 12వ క్రీడాకారిణిగా ఈడెన్ కార్సన్ (న్యూజిలాండ్) ఉన్నారు.

న్యూజిలాండ్ జట్టు తొలిసారి విజేతగా నిలిచింది:
అనుభవజ్ఞురాలైన అమేలియా కెర్ ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను ఓడించి న్యూజిలాండ్ తొలిసారి టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకుంది. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’‌గా కెర్ నిలిచింది. బ్యాటింగ్‌తో అత్యధికంగా 43 పరుగులు చేసిన తర్వాత.. బౌలింగ్‌లో మూడు వికెట్లు పడగొట్టి సౌతాఫ్రికాను చావుదెబ్బ తీసింది.