T20 World Cup 2024: వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం!
- వార్మప్ మ్యాచ్‌లో భారత జట్టు ఘన విజయం
- జెమీమా రోడ్రిగ్స్ హాఫ్ సెంచరీ
- మంగళవారం రెండో వార్మప్ మ్యాచ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India vs West Indies Women Match: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2024 తొలి వార్మప్ మ్యాచ్‌లో భారత జట్టు ఘన విజయం సాధించింది. దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీ గ్రౌండ్‌లో ఆదివారం జరిగిన వార్మప్ మ్యాచ్‌లో 20 పరుగుల తేడాతో వెస్టిండీస్‌పై గెలిచింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. జెమీమా రోడ్రిగ్స్ (52; 40 బంతుల్లో 5 ఫోర్లు) హాఫ్ సెంచరీ చేయగా.. యస్తిక భాటియా (24), స్మృతి మందాన (14) రన్స్ చేశారు. వెస్టిండీస్ బౌలర్లలో హేలీ మాథ్యూస్ నాలుగు వికెట్లు పడగొట్టింది.
లక్ష్య ఛేదనలో వెస్టిండీస్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 121 పరుగులకే పరిమితమైంది. చీనిల్ హెన్రీ (59; 48 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు) హాఫ్ సెంచరీ చేసింది. అఫీ ఫ్లెచర్ (21), షెమైన్ కాంప్బెల్లే (20) రన్స్ చేశారు. భారత బౌలర్లలో పూజ వస్త్రకర్ 3, దీప్తి శర్మ రెండు వికెట్లు పడగొట్టారు. ఈ విజయంతో భారత జట్టులో మరింత ఆత్మవిశ్వాసం పెరిగింది.
Also Read
- డాల్బీ ఆటమ్స్ సపోర్ట్, AI కెమెరా ఫీచర్లతో గ్రాండ్ ఎంట్రీకి సిద్దమైన TECNO CAMON 50 Ultra 5G..!
- India vs England: చేజారిన టీ20 సిరీస్.. రోహిత్-కోహ్లీ రీఎంట్రీ.. ఇక ఇంగ్లండ్‌పై ప్రతీకారమే మిగిలింది..!
- FIFA World Cup 2026: మెరినో మ్యాజిక్.. బెల్జియంపై 2-1 థ్రిల్లర్ విజయంతో సెమీస్‌లోకి స్పెయిన్.!
- Social Media Monitoring: సోషల్ మీడియాకు బ్రేక్‌లు..! ప్రత్యేక మెకానిజం
Also Read: Rohit Sharma Fitness: ఇన్ని మ్యాచ్‌లు ఎలా ఆడగలిగా.. రోహిత్ శర్మ ఘాటు వ్యాఖ్యలు!
భారత జట్టు మంగళవారం రెండో వార్మప్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా మహిళలతో భారత జట్టు తలపడనుంది. గురువారం నుంచి మహిళల ప్రపంచకప్ ప్రధాన మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. మొదటి మ్యాచ్‌లో బంగ్లాదేశ్, స్కాట్లాండ్ మహిళలు తలపడనున్నారు. అక్టోబర్ 4న భారత్ తన ప్రయాణం మొదలెట్టనుంది.
తాజావార్తలు
-
Nithiin : నాని బ్యానర్లో నితిన్ హీరోగా సినిమా ఫిక్స్
-
Shabad M*urder Case: రాత్రి 11 నుంచి అర్ధరాత్రి ఒంటిగంట వరకు కొనసాగిన హత్యలు.. ముందుగా మైనర్ బాలికను తీసుకెళ్లి..
-
Rakta Charitra: ‘రక్త చరిత్ర’ రీ రిలీజ్.. పార్ట్ 3పై క్లారిటీ ఇచ్చిన ఆర్జీవీ.. ‘ఇప్పుడున్న వాళ్లకు అంత సీన్ లేదు’
-
డాల్బీ ఆటమ్స్ సపోర్ట్, AI కెమెరా ఫీచర్లతో గ్రాండ్ ఎంట్రీకి సిద్దమైన TECNO CAMON 50 Ultra 5G..!
-
Roshan Kanakala: ప్రేమ, మిస్టరీ, సైన్స్ ఫిక్షన్.. రోషన్ కనకాల కొత్త సినిమా గ్రాండ్ లాంచ్!
ట్రెండింగ్
-
IND vs ENG: భారత్‌తో సిరీస్‌లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్‌కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!