T20 World Cup 2024: టీమిండియాకు గాయల బెడద.. నలుగురు స్టార్ ప్లేయర్స్..!
- అక్టోబరు 3 నుంచి టీ20 ప్రపంచకప్
- న్యూజిలాండ్‌తో భారత్ తొలి మ్యాచ్
- ఆందోళనలో టీమ్ మెనెజ్‌మెంట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహిళల టీ20 ప్రపంచకప్ 2024 అక్టోబరు 3 నుంచి 20 వరకు యూఏఈ వేదికగా జరగనుంది. మొత్తం 10 జట్లను రెండు గ్రూప్‌లుగా విభజించారు. భారత్ అక్టోబర్ 4న న్యూజిలాండ్‌తో తొలి మ్యాచ్ ఆడనుంది. చిరకాల ప్రత్యర్థులు భారత్, పాక్ మ్యాచ్ అక్టోబర్ 6న జరగనుంది. ఇక 9న శ్రీలంక, 13న ఆస్ట్రేలియాతో తలపడనుంది. భారత మహిళల జట్టు ప్రస్తుతం బెంగళూరులోని ఏన్సీఏలో ప్రాక్టీస్ చేస్తోంది. టైటిల్ లక్ష్యంగా టీమిండియా బరిలోకి దిగుతోంది. అయితే భారత జట్టును గాయాల బెడద వెంటాడుతోంది.
స్టార్ పేసర్ అరుంధతి రెడ్డి ప్రస్తుతం భుజం గాయంతో బాధపడుతోంది. ప్రస్తుతం ఆమె ప్రాక్టీస్ చేయడం లేదు. అయితే ప్రపంచకప్ ఆరంభానికి పూర్తి ఫిట్‌నెస్ సాధించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ అరుంధతి ఈ మెగా టోర్నీకి దూరం అయితే భారత్‌కు గట్టి ఎదురు దెబ్బే అనే చెప్పుకోవాలి. ఎందుకంటే అరుంధతి ప్రస్తుతం అద్బుతమైన ఫామ్‌లో ఉంది. స్టార్ ఆల్‌రౌండర్ పూజా వస్త్రాకర్ కూడా భుజం గాయంతో సతమతమవుతోంది. అయితే పూజా మాత్రం తన ప్రాక్టీస్‌ను కొనసాగిస్తోంది. టోర్నీ ఆరంభ సమయానికి ఆమె పూర్తి ఫిట్‌నెస్ సాధించే ఛాన్స్ ఉంది.
Also Read
- Jantar Mantar Protest: ఢిల్లీలో హైటెన్షన్.. అదుపులోకి మమతా, కేజ్రీవాల్, విజయన్.!
- Solar Storm: రేపు భూమిని తాకనున్న శక్తివంతమైన సౌర తుఫాను.. భారత్‌పై ప్రభావం ఎంత?
- CJP Protest: ఆప్‌లో కీలక నేత, ఇప్పుడు కాక్రోచ్లకు పెద్ద దిక్కు.. ఎవరీ అజింక్యా షిండే.?
- Sudha Murty: చీర కట్టుకుంటే ‘బెహన్జీ’ అంటారు.. జీవిత అనుభవాలు పంచుకున్న సుధా మూర్తి
వేలి గాయం కారణంగా ఆసియా కప్‌కు దూరమైన యువ స్పిన్నర్ శ్రేయాంక పాటిల్ ఇంకా కోలుకోలేదు. టీ20 ప్రపంచకప్ 2024కు ఎంపికైనప్పటకీ.. టోర్నీకి అందుబాటులో ఉంటుందా? లేదా? అన్నది ఇంకా క్లారిటీ లేదు. శ్రేయాంక మెగా ఈవెంట్ ఆడుతుందని మెనెజ్‌మెంట్ ఆశిస్తోంది. స్టార్ బ్యాటర్ జెమిమా రోడ్రిగ్స్ కూడా చేతి వేలి గాయంతో బాధపడుతోంది. అయితే జెమిమా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తోంది. ప్రపంచకప్ సమయానికి కోలుకునే సూచనలు కన్పిస్తున్నాయి. స్టార్ ప్లేయర్లు గాయాలతో బాధపడుతుండడంతో టీమ్ మెనెజ్‌మెంట్ ఆందోళన చెందుతోంది.
తాజావార్తలు
-
Jantar Mantar Protest: ఢిల్లీలో హైటెన్షన్.. అదుపులోకి మమతా, కేజ్రీవాల్, విజయన్.!
-
Vijay Deverakonda: “బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!”.. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
-
Solar Storm: రేపు భూమిని తాకనున్న శక్తివంతమైన సౌర తుఫాను.. భారత్‌పై ప్రభావం ఎంత?
-
CJP Protest: ఆప్‌లో కీలక నేత, ఇప్పుడు కాక్రోచ్లకు పెద్ద దిక్కు.. ఎవరీ అజింక్యా షిండే.?
-
Sudha Murty: చీర కట్టుకుంటే ‘బెహన్జీ’ అంటారు.. జీవిత అనుభవాలు పంచుకున్న సుధా మూర్తి
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!