Site icon NTV Telugu

Venu Swamy-Notice: వేణుస్వామికి మరోసారి నోటీసులు పంపిన మహిళా కమిషన్‌!

Venu Swamy Bigg Boss Telugu 8

Venu Swamy Bigg Boss Telugu 8

ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామికి భారీ షాక్ తగిలింది. టాలీవుడ్ నటులు నాగ చైతన్య, శోభిత ధూళిపాళల వైవాహిక జీవితం మీద కామెంట్స్ చేసిన కేసు విషయంలో మహిళా కమిషన్ ఆయనకు రెండోసారి నోటీసులు జారీ చేసింది. నవంబర్ 14వ తేదీన కమిషన్ ముందు విచారణకు హాజరవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. గతంలో ఈ కేసు విషయంలోనే నోటీసులు పంపగా.. వేణు స్వామి విచారణకు హాజరు కాలేదు.

సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల జాతకాలు చెబుతూ.. వేణుస్వామి తెలుగు రాష్ట్రాల్లో చాలా ఫేమస్ అయ్యారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలపై జోస్యం చెప్పి.. ఆపై క్షమాపణలు కోరారు. ఈ క్రమంలోనే త్వరలో వివాహబంధంతో ఒక్కటి కాబోతున్న అక్కినేని నాగ చైతన్య, శోబిత వైవాహిక జీవితంపై షాకింగ్ కామెంట్స్ చేశారు. నిశ్చితార్థం చేసుకున్న రోజునే.. చై-శోభిత మూడేళ్లలో విడిపోతారని అన్నారు. ఓ మహిళ ప్రమేయంతో 2027లో ఈ జంట విడిపోతారన్నారు. వేణుస్వామి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపాయి. వేణుస్వామిపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read: Hero Vijay: తమిళనాడు ఎన్నికల్లో విజయ్ గెలవలేడు.. రజినీకాంత్ సోదరుడు షాకింగ్ కామెంట్స్!

నాగ చైతన్య, శోబిత వైవాహిక జీవితంపై వేణుస్వామి చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర మహిళా కమిషన్‎కు పలువురు మహిళా జర్నలిస్టులు ఫిర్యాదు చేశారు. జర్నలిస్టుల ఫిర్యాదు మేరకు మహిళా కమిషన్ ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులను సవాల్ చేస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. నోటీసులపై స్టే విధించాలని కోరగా.. వేణుస్వామి అభ్యర్థనకు న్యాయస్థానం ఒకే చెప్పింది. తాజాగా వేణుస్వామికి ఇచ్చిన స్టేను ఎత్తివేసిన హైకోర్టు.. వారం రోజుల్లోగా చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్‎ను ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో వేణుస్వామికి రెండో మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది.

Exit mobile version