NTV Telugu Site icon

Mahakal Temple: ఆలయంలోనే మహిళా భద్రతా సిబ్బంది చిందులు.. వీడియో వైరల్‌ కావడంతో!

Mahakal Temple

Mahakal Temple

Mahakal Temple: మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని జిల్లాలోని మహాకాళేశ్వర్ ఆలయ ప్రాంగణంలో ఇద్దరు మహిళలు నృత్యం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బాలీవుడ్ పాటలకు డ్యాన్స్ చేస్తూ వీడియోలో కనిపిస్తున్న ఈ మహిళలు ఆలయం వద్ద భద్రతా బృందంలో ఉన్నారు. నలుపు రంగు దుస్తులు ధరించిన ఈ ఇద్దరు మహిళలు “జీనే కే బహనే లకోన్”, “ప్యార్ ప్యార్ కర్తే కర్తే” వంటి బాలీవుడ్ హిట్‌లకు డ్యాన్స్ చేయగా.. ఆ వీడియో వైరల్‌గా మారింది.

Santosham Film Awards: ‘సంతోషం’లో స్టెప్పులేయనున్న బాలీవుడ్ బ్యూటీ

ఈ వీడియోను చూసిన ఉజ్జయిన ఏడీఎం సంతోష్ ఠాగూర్ ఈ విషయాన్ని మహాకాల్ ఆలయ నిర్వాహకుడు సందీప్‌ సోనీకి తెలిపాడు. అనంతరం తక్షణమే ఆ మహిళా భద్రతా సిబ్బందిని సేవల నుంచి తొలగించారు. మబాకాల్‌ ఆలయంలో పనిచేస్తున్న వారు ఈ వీడియో గురించి తనకు తెలియజేశారని.. ఈ విషయంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఉజ్జయిని ఏడీఎం సంతోష్‌ ఠాగూర్‌ వెల్లడించారు.