Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Women Reservation Bill Fails Bjp Strategy Political Gain

Women reservation bill: ఓడి గెలిచిన బీజేపీ.. గెలిచి ఓడిన కాంగ్రెస్..!

Published Date :April 17, 2026 , 9:26 pm
By Venu Goapl Reddy
  • లోక్‌సభలో వీడిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు..
  • కానీ రాజకీయ వ్యూహంలో గెలిచిన బీజేపీ..
  • ప్రతిపక్షాలు మహిళా బిల్లుకు వ్యతిరేకమని ప్రచారం..
Women reservation bill: ఓడి గెలిచిన బీజేపీ.. గెలిచి ఓడిన కాంగ్రెస్..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Women reservation bill: 2029 సార్వత్రిక ఎన్నికల ముందు మహిళా రిజర్వేషన్ బిల్లుతో సహా లోక్‌సభ సీట్లను పెంచాలనే బీజేపీ కలకు బ్రేక్ పడింది. లోక్‌సభలో శుక్రవారం ప్రవేశపెట్టిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయింది. దీంతో మహిళా బిల్లుతో సహా మరో బిల్లును కేంద్రం ఉపసంహరించుకుంది. 2/3 వంతు మద్దతును ఎన్డీయే ప్రభుత్వం కూడగట్టలేకపోయింది. బయట నుంచి చూస్తే ఇది బీజేపీకి ఘోర పరాజయంగా కనిపించవచ్చు, కానీ రాజకీయంగా ఇది బీజేపీకి విజయమే అని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఈ మొత్తం ఎపిసోడ్‌లో ‘‘ఓడిపోయి బీజేపీ గెలిచింది. గెలిచి కాంగ్రెస్ ఓడిపోయింది’’ అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. లోక్‌సభలో బిల్లుకు వ్యతిరేకంగా ఓట్లు పడిన తర్వాత, కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు మాట్లాడుతూ.. ఒక చారిత్రాత్మక బిల్లును ప్రతిపక్షాలు అడ్డుకున్నాయని విమర్శించారు. మహిళా బిల్లును అడ్డుకున్నారని మండిపడ్డారు. అయితే, తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

Read Also: Rahul Gandhi: మహిళా బిల్లు కాదు, అందుకే అడ్డుకున్నాం..

బీజేపీకి సంఖ్యా బలం లేదని ముందే తెలుసు. కానీ ప్రతిపక్షాల నుంచి మద్దతు వస్తుందని ఊహించారు. ఒక వేళ ఓడిపోతే ప్లాన్-బికి కూడా బీజేపీ సిద్ధంగా ఉంది. ఇప్పుడు గెలిచినా, ఓడినా క్రెడిట్ మొత్తం బీజేపీ ఖాతాలోకే వెళ్లినట్లయింది. ‘‘మహిళా రిజర్వేషన్లకు ప్రతిపక్షాలు, కాంగ్రెస్ వ్యతిరేకం’’ అని బీజేపీ ఒక రాజకీయ నినాదాన్ని సృష్టించబోతోంది. పశ్చిమబెంగాల్, తమిళనాడు ఎన్నికల ముందు ఇది ఎంతో కొంత ప్రభావం చూపించే అంశంగా మారింది. గురువారం లోక్‌సభలో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ఈ బిల్లును వ్యతిరేకించే వారిని దేశంలో మహిళలు క్షమించరని చెప్పారు.

ఇక ఇప్పటి నుంచి ప్రతిపక్షాలను ముఖ్యంగా కాంగ్రెస్‌పై బీజేపీ విరుచుకుపడుతుంది. కాంగ్రెస్, ఇండీ కూటమి బిల్లుకు వ్యతిరేకమనే ఒక వాదనను ప్రజల్లోకి తీసుకెళ్తుంది. 2010లో మహిళా రిజర్వేషన్లను వ్యతిరేకించి సమాజ్‌వాదీ పార్టీ, ఆర్జేడీలు రాజకీయంగా కొంత కాలం దెబ్బతిన్నాయి. 2010లో అప్పటి మన్మోహన్ సింగ్ సర్కార్ మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును తీసుకువచ్చింది. ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌లు వ్యతిరేకించారు.

ప్రతిపక్షాలు బీజేపీ ప్రవేశపెడుతున్న బిల్లులు రాజ్యాంగ వ్యతిరేకమని, దేశ రాజకీయ స్వరూపాన్ని మార్చే కుట్ర అని రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ వాదిస్తున్నారు. వీటన్నింటిని పక్కన పెట్టి బీజేపీ మాత్రం కాంగ్రెస్ మహిళా వ్యతిరేకమనే నేరెటివ్‌‌ను తయారు చేస్తుంది. మొత్తానికి బీజేపీ బిల్లుల విషయంలో ఓడిపోయినప్పటికీ, రాజకీయ వ్యూహాల్లో మాత్రం గెలిచిందని చెబుతున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • BJP strategy analysis
  • BJP women bill
  • congress
  • India political news
  • Lok Sabha vote result

తాజావార్తలు

  • Women reservation bill: ఓడి గెలిచిన బీజేపీ.. గెలిచి ఓడిన కాంగ్రెస్..!

  • GT vs KKR: బ్యాటు ఝుళిపించిన కామెరూన్ గ్రీన్.. గుజరాత్ టార్గెట్ ఎంతంటే?

  • Fish Pickle: చేపల పచ్చడి నీచు వాసన రాకుండా పర్ఫెక్ట్‌గా కుదరాలా.. అయితే సింపుల్‌గా ఇలా చేయండి!

  • Video Call: 45, 55 ఏళ్ల మహిళల న్యూడ్ వీడియో కాల్ దందా.. పక్కా ప్లాన్ ప్రకారం ఇలా..

  • Rahul Gandhi: మహిళా బిల్లు కాదు, అందుకే అడ్డుకున్నాం..

ట్రెండింగ్‌

  • రాత్రి పడుకునే ముందు శరీరంలోని ఈ రెండు భాగాలకు ఆవనూనెతో ఎందుకు మర్దన చేయాలి?

  • Burning Feet Hacks: పాదాల్లో మంటలా..? ఇంటి చిట్కాలతో ఇలా చెక్ పెట్టండి.!

  • Neem Juice: వేప రసం తాగుతున్నారా? అయితే ఈ షాకింగ్ విషయాలు తెలుసుకోవాల్సిందే.!

  • Health Tips : వర్కౌట్ బట్టల్లో ప్రాణాంతక రసాయనాలు.. ఫిట్‌నెస్ కోసం వెళ్తే అనారోగ్యం ఫ్రీ.!

  • Train Ticket Rules: రైలు ప్రయాణికుల టెన్షన్‌కు ఇక సెలవు.. అమల్లోకి కొత్త చార్ట్ రూల్స్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions