Site icon NTV Telugu

Anakapalle Crime: ప్రేమోన్మాది ఘాతుకానికి యువతి బలి.. మత్తు ఇంజెక్షన్‌ ఇచ్చి, కత్తితో పొడిచి..!

Crime News

Crime News

Anakapalle Crime: అనకాపల్లి జిల్లా అచ్యుతపురం లాడ్జిలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు.. మహాలక్ష్మి అనే యువతిని శ్రీనివాస్ అనే యువకుడు దారుణంగా కత్తితో గాయపరిచి హతమార్చాడు.. మహాలక్ష్మిని హతమర్చడానికి ముందుగానే పథకం ప్రకారం కత్తులు, మత్తు ఇంజెక్షన్ లు తీసుకొని వచ్చినట్టు గుర్తించారు పోలీసులు. ప్రేమ పేరుతో రిజిస్టర్ ఆఫీస్ లో మ్యారేజ్ చేసుకొని టార్చర్ చేసేవాడని, అది తట్టుకోలేక శ్రీనివాస్ నుండి విడిపోయి ఉంటుందని బంధువులు తెలిపారు.. అయితే, అచ్యుతాపురం లాడ్జిలో ప్రేమికులు సోమవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు ముందుగా అంతా భావించారు..

Read Also: Telangana Politics: ఆ ఇద్దరు.. ఎటువైపు..?

విశాఖపట్నం జిల్లా జీవీఎంసీ పరిధిలోని కూర్మన్నపాలెంకు చెందిన ఎస్‌.మహాలక్ష్మి, గాజువాకకు చెందిన శ్రీనివాస్‌కుమార్‌ సోమవారం అచ్యుతాపురంలోని ఓ లాడ్జిలో రూం తీసుకున్నారు. ఈ క్రమంలో లాడ్జిలో మహాలక్ష్మి, శ్రీనివాస్ కత్తితో కోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని అనుకున్నారు.. లాడ్జి సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఇద్దరూ కత్తితో కోసుకున్న గాయాలతో కనిపించారు. వెంటనే లాడ్జి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మహాలక్ష్మి, శ్రీనివాస్‌ కుమార్‌ను అనకాపల్లి ఎన్టీఆర్‌ ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే మహాలక్ష్మి మృతి చెందగా.. శ్రీనివాస్‌ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇద్దరి శరీరాలపై తీవ్ర గాయాలను గుర్తించారు పోలీసులు.. అయితే, పథకం ప్రకారమే మహాలక్ష్మిని శ్రీనివాస్‌ హత్య చేశాడని ఆరోపిస్తున్నారు మృతురాలి బంధువులు.. కేసు నుంచి తప్పించుకోవడానికే తనపై కూడా దాడి జరిగినట్టు డ్రామా ఆడాడని ఆరోపిస్తున్నారు.. మహాలక్ష్మిపై కక్ష పెంచుకొని ఇంతటి దారుణానికి పాల్పడ్డాడని, తమ బిడ్డను తమకు కాకుండా చేసిన శ్రీనివాస్ ను ఉరి తియ్యాలని కేజీహెచ్ వద్ద ఆందోళనకు దిగారు మహాలక్ష్మి బంధువులు.

Exit mobile version