Site icon NTV Telugu

Land Grabbing: మా ల్యాండ్ కబ్జా చేశారు.. వైసీపీ మాజీ ఎమ్మెల్యేపై హైడ్రాలో ఫిర్యాదు!

Hydraa

Hydraa

వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డిపై హైడ్రాలో ఫిర్యాదు నమోదైంది. అమీన్ పూర్‌లో 193 సర్వే నంబర్‌లోని తమ ల్యాండ్ కబ్జాకు గురైందని ఓ మహిళ హైడ్రాకు ఫిర్యాదు చేశారు. పాన్యం మాజీ ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డి, చిస్ట్లా రమేష్ కలిసి తమ ల్యాండ్ కబ్జా చేశారని తెలిపారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని రాంభూపాల్ రెడ్డి దౌర్జన్యాలు చేశారని, అందుకు సంభందించిన అన్ని ఆధారాలు హైడ్రాకు సమర్పించానని సదరు మహిళ చెప్పారు. తన ఫిర్యాదుపై హైడ్రా కమిషనర్ స్పందించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని చెప్పుకొచ్చారు.

Also Read: Kolikapudi Srinivasarao: నేను ఎలాంటి తప్పు చెయ్యలేదు.. టీడీపీ క్రమశిక్షణ కమిటీతో ఎమ్మెల్యే కొలికపూడి!

‘పాన్యం మాజీ ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డి, చిస్ట్లా రమేష్ కలిసి అమీన్ పూర్‌లో 193 సర్వే నంబర్‌లోని నా ల్యాండ్‌ను కబ్జా చేశారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని రాంభూపాల్ రెడ్డి దౌర్జన్యాలు చేశారు. అందుకు సంభందించిన అన్ని ఆధారాలు హైడ్రాకు సమర్పించాను. చెరువు ఔట్ ఫ్లో వెళ్లకుండా మొత్తం మట్టి పోసి ఎత్తు పెంచారు. దాని వల్ల చెరువు పెద్దగా విస్తరించి.. రైతులు, స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. చాలా లేఔట్‌లు, అగ్రి కల్చర్ ల్యాండ్స్ మునిగి పోయాయి. అన్ని టెక్నికల్ ఎవిడెన్స్, గూగుల్ పిక్చర్స్, ఎఫ్ఐఆర్ కాపీలు హైడ్రా కమిషనర్‌కు అందజేసాను. చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ హామీ ఇచ్చారు. ఇప్పటికే కబ్జాకు గురైన మా లేఔట్ ప్లాట్లు, రోడ్లు విడుదల జరిగాయి. కానీ ఇంకా చాల ప్లాట్లు నీళ్లలో మునిగే ఉన్నాయి. అందుకు కారణం నాళాను మూసేసి.. నీరు వెళ్లకుండా చేయడమే’ అని మహిళ చెప్పారు.

Exit mobile version