NTV Telugu Site icon

Honour Killing: తాగుదామని పిలిపించి అల్లుడిని చంపేసిన కుటుంబం.. సంచలనంగా ‘‘పరువు హత్య’’

Crime

Crime

Honour Killing: గ్రేటర్ నోయిడాలో ఇటీవల జరిగిన హత్య గుట్టు వీడింది. ఈ హత్యను ‘‘పరువు హత్య’’గా పోలీసులు తేల్చారు. తమ ఇష్టానికి విరుద్ధంగా కూతురు వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవడంతో కక్ష పెంచుకున్న కుటుంబం అల్లుడిని దారుణంగా హతమార్చింది. నమ్మించి చంపేసింది. తాగుతామని ఇంటికి పిలిపించి, వ్యక్తిని చంపేశారు. చంపేందుకు మనుషులను ఏర్పాటు చేసుకునేందుకు సదరు కుటుంబం రూ. 3 లక్షలకు బంగారాన్ని తాకట్టు పెట్టింది. ఈ కేసులో ఇద్దరు నిందితులు పరారీలో ఉండగా, మహిళ తండ్రి, మామతో పాటు ఇద్దరు కాంట్రాక్ట్ కిల్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు.

జోన్ 2 డీసీపీ సునీతి ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. జూన్ 16న ఎకోటెక్-3 పోలీస్ స్టేషన్ పరిధిలోని సంగమ్ విహార్ కాలనీ సమీపంలో ఒక వ్యక్తి మృతదేహం కనిపించింది. చనిపోయిన వ్యక్తిని భూలేష్ కుమార్‌గా గుర్తించారు. ఇతను ఉత్తర్ ప్రదేశ్ సంభాల్ నివాసి. ఈ హత్య తర్వాత భూలేష్ కుటుంబం అతని భార్య ప్రీతి యాదవ్ తండ్రి బుద్ సింగ్ యాదవ్, సోదరులు ముఖేష్ యాదవ్, స్నేహితుడు శ్రీపాల్ యాదవ్‌పై కేసు పెట్టారు. ఐదేళ్ల క్రితం భూషేష్, ప్రీతి పెళ్లి చేసుకున్నారు. ప్రీతి కుటుంబ సభ్యులకు ఇష్టం లేకున్నా పారిపోయి భూలేష్‌ని వివాహం చేసుకుంది.

Read Also: Sharad Pawar: మహారాష్ట్ర ఎన్నికల్లో మేం కలిసి పోరాడుతాం.. శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు..

అయితే, ఈ వివాహం జరిగి 5 ఏళ్ల తర్వాత అంతా కలిసిపోదామని మాయమాటలు చెప్పిన ప్రీతి కుటుంబం అల్లుడు భూలేష్‌ని ఇంటికి రావాలని కోరింది. తాగుదామని, విందు చేసుకుందామని ప్రీతి కుటుంబం నమ్మించింది. ఈ నేపథ్యంలో అత్తామామ ఇంటికి వెళ్తుండగా, అతని భార్య తండ్రి, మామ నియమించుకున్న కాంట్రాక్ట్ కిల్లర్స్ భూలేష్ గొంతు నులిమి చంపారు. విచారణలో ప్రీతి తండ్రి బుద్ధ్ సింగ్ యాదవ్ మరియు మామ ఖరక్ సింగ్ కుట్ర చేసి భూలేష్‌ను చంపడానికి వారి పొరుగు గ్రామమైన మండోలికి చెందిన నలుగురు అబ్బాయిలను నియమించుకున్నారని తేలింది.

నలుగురు నిందితులు అవధేష్, నీరజ్ యాదవ్, యశ్‌పాల్ మరియు టిటు నోయిడాకు వచ్చి భూలేష్‌ను గొంతు కోసి అతని ఆటోరిక్షాను తీసుకెళ్లినట్లు విచారణలో తేలింది. నేరానికి సంబంధించి ఉపయోగించిన వాహనం, గొంతు నులిమి చంపడానికి ఉపయోగించిన టవల్, హత్యకు బదులుగా పొందిన నగలు కూడా నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నట్లు సునీతి తెలిపారు.