NTV Telugu Site icon

Pakistan video: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో మహిళా టిక్‌టాకర్‌కు లైంగిక వేధింపులు.. వివస్త్రను చేసిన యువకులు

Woman Tiktoker Pakistan Lah

Woman Tiktoker Pakistan Lah

పాకిస్థాన్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఘోరం జరిగింది. వేదికపై ఉన్న మహిళా టిక్‌టాకర్‌ పట్ల యువకులు నీచానికి ఒడిగట్టారు. పట్టపగలే ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఇష్టానుసారంగా చేతులు వేసి.. వస్త్రాలు చింపి వివస్త్రను చేసి బలత్కారానికి పాల్పడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

లాహోర్‌లో పాకిస్థాన్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. వందలాది మంది ముస్లిం పురుషులు స్టేజీ దగ్గర గుమిగూడున్నారు. అయితే ఒక మహిళా టిక్‌టాకర్ ఎక్కడికి ఎందుకు వచ్చిందో తెలియదు. ఎవరైనా ఆహ్వానించారా? లేదంటే ఆమె వచ్చి ప్రోగ్రామ్స్ చేస్తుందో తెలియదు గానీ.. స్టేజ్‌పై ఉన్న ఆమెను యువకులు చుట్టుముట్టారు. దీంతో ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరి అయింది. ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. ఇష్టానుసారంగా ఆమెపై చేతులు వేసి.. స్టేజ్ కింద ఉన్న వారు బట్టలు చింపారు.. ఇంకొందరు ఆమెపై చేతులు వేసి ఘోరంగా టార్చర్ చేశారు. దీంతో ఆమె ఆ వేధింపులు తాళలేక విలవిలలాడింది. కాపాడమంటూ ఆమె మొర్ర పెట్టుకున్న ఆక్రందనలు మృగాళ్లకు వినిపించలేదు. ఎవరూ రక్షించే ప్రయత్నం చేయలేదు. ఇష్టానుసారంగా దాడి చేయడంతో ఆమె స్టేజ్ పైనుంచి కిందపడిపోయింది. ఆమె వస్త్రాలను చించేయడంతో సగం అర్ధనగ్నంగా అయిపోయింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిందితుల పట్ల చర్యలు తీసుకోవాలని పాకిస్థాన్ ప్రభుత్వాన్ని నెటిజన్లు కోరుతున్నారు.

Show comments