పాకిస్థాన్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఘోరం జరిగింది. వేదికపై ఉన్న మహిళా టిక్‌టాకర్ పట్ల యువకులు నీచానికి ఒడిగట్టారు. పట్టపగలే ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఇష్టానుసారంగా చేతులు వేసి.. వస్త్రాలు చింపి వివస్త్రను చేసి బలత్కారానికి పాల్పడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.