Site icon NTV Telugu

Strange Incident: హైదరాబాద్‌లో వింత ఘటన.. ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై పాము విసిరిన మహిళ..

Snake

Snake

కొన్ని కొన్ని సార్లు ఎవరు ఎలా ప్రవర్తిస్తారో తెలియదు. కొందరు క్షణికావేశంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. ఆ తరువాత బాధపడుతుంటారు. అలాంటి ఘటనే హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. బస్సు కోసం వెయిట్‌ చేస్తోంది ఓ మహిళ. అయితే.. అదే సమయానికి ఓ ఆర్టీసీ బస్సు వచ్చింది కాని.. ఆమె ఉన్న చోట ఆపకుండా వెళ్లిపోయింది. దీంతో కోపంతో అందుబాటులో ఉన్న బీర్ బాటిల్‌ను బస్సుపైకి రువ్వింది. ఆ మహిళ విసిరిన బీర్ బాటిల్‌ బస్సు వెనుక భాగంలోని అద్దాన్ని ధ్వంసం చేసింది. దీంతో.. ఆ బస్సు డ్రైవర్‌ బస్సు ఆపి ఆ మహిళను పట్టుకునేందుకు ఆమెను వెంబడించడంతో సదరు మహిళ చేసిన పనికి డ్రైవర్‌ పరుగులు తీశాడు.

Thyroid problems: థైరాయిడ్ సమస్యలకు ఇలా చెక్ పెట్టేయండి..

వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ నల్లకుంట విద్యా నగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో విద్యా నగర్ వద్ద మద్యం మత్తులో ఉన్న మహిళ ఆర్టీసీ బస్సు ఆపే ప్రయత్నం చేసింది. దీంతో.. బస్సు ఆపకుండా డ్రైవర్ వెళ్లిపోయాడు. ఆగ్రహంతో బస్సు పై బీర్ బాటిల్ తో దాడి చేసింది మహిళ. దీంతో బస్సు వెనుక భాగం లోని అద్దం విరగడంతో బస్సు ఆపి మహిళను పట్టుకునే ప్రయత్నం చేశాడు డ్రైవర్. ఈ క్రమంలో ఆగ్రహంతో బస్సు డ్రైవర్ పై తన వద్ద ఉన్న పామును విసిరింది మహిళ. భయంతో ఖంగుతిని అక్కడి నుండి డ్రైవర్ పారిపోయాడు. దీంతో.. ఆర్టీసీ డ్రైవర్ ఫిర్యాదు మేరకు మహిళను అదుపులోకి తీసుకున్నారు నల్లకుంట పోలీసులు.

Serial Killer: చెరుకు తోటల్లో చీరతో ఉరేసి..యూపీలో సీరియర్ కిల్లర్..? 9 మంది మహిళల హత్య..

Exit mobile version