Site icon NTV Telugu

Acid Attack: లేట్ ఎందుకు అయింది.. ఇంటికొచ్చిన భర్తపై యాసిడ్ పోసిన భార్య

Acid Attack

Acid Attack

Acid Attack: క్షణికావేశాల కారణంగా నేరాల సంఖ్య పెరిగిపోతోంది. ఇటీవల అనుమానమనే పెనుభూతం సంబంధాలను తుంచివేస్తోంది. తాజాగా ఇంటికి ఆలస్యంగా వచ్చినందుకు గొడవపడి ఓ మహిళ తన భర్త ముఖంపై యాసిడ్ పోసింది. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో చోటుచేసుకుంది. కాన్పూర్‌లోని కూపర్‌గంజ్‌ ప్రాంతంలో డబ్బు, భార్య పూనమ్‌తో కలిసి నివసిస్తున్నారు. వారిద్దరి మధ్య ఇటీవల గొడవలు జరుగుతున్నట్లు తెలిసింది.

Water Tax: భూమిలోని నీటిని తోడితే ట్యాక్స్ కట్టాల్సిందే.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

శనివారం రాత్రి డబ్బు ఇంటికి ఆలస్యంగా వచ్చాడు. అప్పుడు ఇంట్లో ఉన్న తన భార్య పూనమ్‌ ఎందుకు లేటు అయిందని భర్తతో గొడవకు దిగింది. భార్య గట్టిగా అరవడంతో అతను కూడా తన భార్యపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. దాంతో ఆమె కోపం కట్టలు తెంచుకుంది. అంతే ఆవేశంతో వాష్‌రూమ్‌లో ఉన్న యాసిడ్‌ను తీసుకువచ్చి అతని ముఖంపై పోసింది. యాసిడ్ పోయడంతో అతను వెంటనే అరుస్తూ అక్కడే పడిపోయాడు. అతడు గట్టిగా అరుస్తూ కిందపడిపోవడంతో పక్కన ఇంట్లో వారి పరిగెత్తుకుంటూ వచ్చారు. అతడిని ఆస్పత్రికి తరలించారు. ఈ విషయాన్ని పోలీసులకు తెలిపారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు నిందితురాలిని అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Exit mobile version