Dead Body : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం త్రివేణి సంగమ గోదావరి నదిలో విషాదం నెలకుంది. గోదావరి నదిలోకి దూకి మహిళ ఆత్మహత్య చేసుకుంది. టేకుమట్ల మండలం సుబ్బక్కపల్లి గ్రామానికి చెందిన బొడ్డు సమ్మక్క(65) అనే మహిళ గత నెల 27 న తన ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య గొడవలు రాగా మనస్థాపం చెంది ఇంటి నుండి కనిపించకుండా వెళ్లిపోయింది. దీంతో కుటుంబ సభ్యులు ఆమే కోసం గాలించగా ఎక్కడ ఆచూకీ లభించలేదు. టేకుమట్ల పీఎస్ లో ఫిర్యాదు చేశారు. అదే రోజు కాళేశ్వరం చేరుకోని గోదావరి నదిలో మునిగి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు.
Packaged drinking water: హై-రిస్క్ కేటగిరీలో ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్, మినరల్ వాటర్
ఈ రోజు కాళేశ్వరం గోదావరి నదిలో మహిళ మృతదేహం తేలియాడుతు కనిపించింది. తీరంలో ఉన్న స్తానిక గంగాపుత్రులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతురాలు కుటుంబ సభ్యులు గోదావరికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించగా సమ్మక్కగా ధృవికరించారు. దీంతో కాళేశ్వరం పోలీసులు జాలరుల సహయంతో మృతదేహాన్ని బయటకు తీయగా..మృతదేహం కుళ్లీపోయి ఉండడంతో తీరంలోనే డాక్టర్ పోస్ట్ మార్టం నిర్వహించనున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నారు.
Minister Nadendla Manohar: కాకినాడ పోర్టులో పట్టుపడిన రేషన్ బియ్యం.. మంత్రి నాదెండ్ల కీలక వ్యాఖ్యలు