Pakistan: పారామిలటరీ కాన్వాయ్‌ను లక్ష్యంగా చేసుకునే ప్రయత్నంలో శనివారం నైరుతి పాకిస్తాన్‌లో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో ఓ పోలీసు అధికారి ప్రాణాలు కోల్పోగా.. ఐదుగురు గాయపడ్డారని ఓ అధికారి తెలిపారు. నైరుతి నగరమైన టర్బాట్‌లో పేలుడు సంభవించిన తరువాత ఒక మహిళా బాంబర్ అవశేషాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారని అడ్మినిస్ట్రేటివ్ అధికారి బషీర్ అహ్మద్ తెలిపారు.
Also Read: Omicron: ఒమిక్రాన్ ఎంఆర్‌ఎన్‌ఏ బూస్టర్ వ్యాక్సిన్ ప్రారంభం
బాంబర్ పారామిలిటరీ ఫ్రాంటియర్ కార్ప్స్ కాన్వాయ్‌ను లక్ష్యంగా చేసుకున్నాడని, అయితే పేలుడు ప్రధాన భాగం పోలీసు వాహనాన్ని తాకిందని అహ్మద్ చెప్పారు. ఫ్రాంటియర్ కార్ప్స్ వాహనం స్వల్పంగా దెబ్బతిన్నదని, గాయపడిన వారిలో మహిళా పోలీసు కూడా ఉన్నారని ఆయన చెప్పారు. ఈ దాడికి తక్షణమే ఎవరూ బాధ్యత వహించలేదు, అయితే గతంలో ఇలాంటి దాడులు బలూచ్ వేర్పాటువాద గ్రూపులు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
