Site icon NTV Telugu

Suicide Attempt: ప్రియుడి మోసం.. మూడో అంతస్తు నుంచి దూకేసిన ప్రియురాలు.. చివరకు?

Suicide Attempt

Suicide Attempt

Suicide Attempt: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ లో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. సెంట్రల్ కోతవాలి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఒక యువతి తన ప్రియుడితో జరిగిన వివాదం తరువాత మూడో అంతస్తు నుండి చూస్తుండగానే ఒక్కసారిగా దూకేసింది. అయితే, అదృష్టవశాత్తు కింద ఉన్న విద్యుత్‌ తీగల మధ్య చిక్కుకోవడం వల్ల ఆమెకు ప్రాణాపాయం తప్పింది. అయితే ఆమె చేతులు, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఆ యువతి ఖర్గోన్ ప్రాంతానికి చెందినవారని పోలీసులు తెలిపారు. బుధవారం రాత్రి యువతి తన బాయ్‌ఫ్రెండ్ ఆవేశ్ ఇంటికి వెళ్లింది. అక్కడ ఇద్దరి మధ్య కాస్త ఎక్కువగానే వాగ్వాదం జరిగింది. యువతి ఆరోపణల ప్రకారం, ఆవేశ్ ఇప్పటికే మరొకరిని వివాహం చేసుకున్నప్పటికీ.. తనతో నాలుగేళ్లుగా సంబంధం కొనసాగించాడు. వివాదం తీవ్రతరం కావడంతో ఆవేశ్ తనను చంపడానికి ప్రయత్నించాడని యువతి ఆరోపించింది. దీంతో కోపంతో యువతి మూడో అంతస్తుకు వెళ్లి అక్కడి నుండి కిందకు దూకినట్లు పోలీసులు తెలిపారు.

Shreyas Iyer: వన్డే కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్.. బీసీసీఐ స్పందన ఇదే!

ఈ ఘటనను ఆవేశ్, అతని కుటుంబ సభ్యులు మొబైల్‌లో రికార్డ్ చేసినట్లు వీడియోలో కనిపించింది. వారు యువతిని దూషించడంతో పాటు, ఆమె పడిపోగానే భయపడి సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఘటనను దాచిపెట్టడానికి వారు ప్రయత్నించారు. అంతేకాకుండా, ఆవేశ్ ఆమె మొబైల్ నుండి చాటింగ్, ఇతర సాక్ష్యాలను డిలీట్ చేశాడని ఆరోపణలు వచ్చాయి. తరువాత ఆసుపత్రిలో ఆ యువతిని వదిలేసి కుటుంబ సభ్యులు పరారయ్యారు.

200MP అల్ట్రా-క్లియర్ కెమెరా, IP58/IP59 రేటింగ్స్, స్టైలిష్ డిజైన్‌తో HONOR Magic V Flip2 లగ్జరీ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ లాంచ్!

ఇకపోతే, పోలీసులకు ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో యువతి తెలిపిన ప్రకారం.. తన పరిచయం ఆవేశ్‌తో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఏర్పడిందని, గత నాలుగేళ్లుగా ఇద్దరి మధ్య సంబంధం కొనసాగిందని తెలిపారు. ఈ సమయంలో అతను పెళ్లి చేసుకుంటానని చెప్పి శారీరక సంబంధం పెట్టుకున్నాడు. కానీ, ఆ తరువాత మరో అమ్మాయితో వివాహం చేసుకున్నాడు. యువతి ఇదివరకే ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆవేశ్ జైలుకు వెళ్లినప్పటికీ, ఆ తరువాత బయటకు వచ్చి పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాడు. కానీ, ఆగస్టు 15న తనను మత్తు మందు ఇచ్చి లైంగిక దాడికి పాల్పడ్డాడని యువతి ఆరోపించింది. ప్రస్తుతం యువతి ఆరోగ్యం స్థిరంగా ఉందని వైద్యులు తెలిపారు. సెంట్రల్ కోతవాలి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. యువతి స్టేట్‌మెంట్, వీడియోలు ఇంకా సాక్ష్యాల ఆధారంగా ఆవేశ్, అతని కుటుంబంపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయనున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Exit mobile version