జీవితం భారంగా మారింది. ఇక ఈ జీవితం సాగించలేం.. కలెక్టరు గారూ మా కుటుంబం కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వండి అంటూ ఒక మహిళ అర్జీ పెట్టుకుంది..ఇక జీవించలేం తాము చనిపోయేందుకు అనుమతి ఇవ్వమని వేడుకుంటున్న ఉదంతం సంచలనంగా మారింది. అంతటి కష్టం ఆ తల్లికి ఏమివచ్చిందంటూ ఆరా తీయగా హృదయం ద్రవించే కధనం వెలుగుచూసింది..ఆమె భర్త మరణించి మూడు సంవత్సరాలు అయింది. తను బ్రతికి ఉన్నప్పుడు ప్రభుత్వానికి ఆదాయపన్ను కట్టాడంటూ ఆమెకు ఆధారంగా ఉన్న పింఛను పీకివేయడంతో బ్రతకలేక ఆమె ఈ నిర్ణయం తీసుకుంది.
Read Also: Kodali Nani Sesational Press Meet Live: కొడాలి నాని సెన్సేషనల్ ప్రెస్ మీట్
అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం కొమానపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్, సత్యశ్రీ దంపతులు తమ ఇద్దరు కుమారులతో ఎంతో అన్యోన్యంగా ఆనందంగా జీవించేవారు..శ్రీనివాస్ నాగపూర్ లో ఒక ప్యాక్టరీలో సూపర్ వైజరుగా పనిచేసి బాగా సంపాదించేవాడు. తన ఇద్దరు పిల్లలను మంచి కాన్వెంట్ లో చదివించేవారు. ప్రభుత్వానికి ఆదాయపన్నుకూడా కట్టేవాడు..వీరిపై విధి పగబట్టింది శ్రీనివాస్ ఆరోగ్యం క్రమంగా క్షీణించసాగింది. వేరే ప్రాంతానికి మారితే ఆరోగ్యం కుదుటపడుతుందని భావించిన వారి కుటుంబం షిర్డీలో మరో కంపెనీలో పనికిచేరాడు..షిర్టీలో అతని ఆరోగ్యం మరింత క్షీణించడంతో తమ సొంతగ్రామానికి వచ్చేసారు…
ఇక్కడికి వచ్చిన తరువాత అనేక ఆసుపత్రులలో వైద్యం చేయించుకున్నాడు తిరుపతి రుయా హాస్పిటల్ వంటి ఆసుపత్రిల చుట్టూ తిరిగాడు..తాను సంపాదించినదంతా ఖర్చు అయిపోగా అప్పులు కూడా చేసి ఖర్చుపెట్టినా ఫలితం లేకపోవడంతో మూడు సంవత్సరాల క్రితం అతను మరణించాడు..అప్పటినుండీ సత్యశ్రీ తన 12,13 సంవత్సరాల కుమారులతో ఊరిలోనే ఉంటూ కూలీపనులకు వెళ్లి తన పిల్లను పోషించుకుంటూ,ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తుంది..వీరి పిల్లలకు అమ్మవడి వంటి ప్రభుత్వ పధకాలు ఎమీ అందడంలేదు. అయినా తన రెక్కల కష్టంతో బిడ్డలను సాకుతోంది..
గత సంవత్సరం ఆమెకు విడో పించను ప్రభుత్వం మంజూరుచేసింది. ప్రతీనెలా వచ్చే పించను ఈ నెల రాకపోవడంతో ఏమిటా అని ఆరా తీయగా తన భర్త బ్రతికి ఉన్నప్పుడు ప్రభుత్వానికి ఆదాయం పన్ను చెల్లించేవాడని. గతంలో ఆదాయంపన్ను చెల్లించినందున ఇప్పుడు ఆమె పింఛను నిలిపి వేస్తున్నట్లు సమాధానం వచ్చింది.. దీనితో ఆమె హతాశురాలైంది, ప్రస్తుతం తన ఆరోగ్యం కూడా బాగా లేకపోవడంతో కూలిపనులకు కూడా వెళ్లలేకపోవడం, ప్రభుత్వం తన పింఛను నిలిపివేయటంతో ఆమెకు బ్రతుకుపై విరక్తి కలిగింది.. తాను చనిపోతే తన బిడ్డలు అనాథలవుతారని భావించి తనతో పాటు తన కుమారులకు కూడా కారుణ్య మరణం పొందేందుకు అనుమతి ఇవ్వాలని, లేదా ప్రభుత్వం తన పించను పునరుద్దరించి, అమ్మ ఒడి వంటి పథకాలను తన పిల్లకుకూడా అందచేయాలని వేడుకుంటోంది..లేని పక్షంలో కోనసీమ కలెక్టరును కలిసి తమకు కారుణ్య మరణం ప్రసాదించమని వేడుకుంటానని మీడియాముందు ఆవేదన వ్యక్తం చేస్తోంది.
Read Also: Karnataka: ఉద్రిక్తత పెంచుతున్న మంగళూర్ హత్య.. 144 సెక్షన్ విధింపు..