Illicit Relationship: మీరు మారరా.. పక్షవాతానికి గురైన భర్తను ప్రియుడి సాయంతో..
- భార్యాభర్తల బంధంలో అక్రమ సంబంధాలు చిచ్చు
- మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో దారుణం
- ఓ మహిళ, ప్రియుడితో కలిసి మంచం పట్టిన భర్తను దిండుతో గొంతు నులిమి హత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భార్యాభర్తల బంధంలో అక్రమ సంబంధాలు చిచ్చుపెడుతున్నాయి. పరాయి వ్యక్తుల మోజులో పడి భర్తలను అంతమొందిస్తున్నారు కొందరు భార్యలు. తాజాగా మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళ, ప్రియుడితో కలిసి మంచం పట్టిన భర్తను దిండుతో గొంతు నులిమి హత్య చేసి, దానిని సహజ మరణంలా చిత్రీకరించడానికి ప్రయత్నించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
దిశా రామ్టేకే (30), చంద్రసేన్ రామ్టేకే (38) 13 సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు కుమార్తెలు, ఆరేళ్ల కుమారుడు ఉన్నారు. సుమారు రెండు సంవత్సరాల క్రితం, భర్త పక్షవాతం బారిన పడ్డాడు. ఈ నేపథ్యంలో భర్త తరచుగా తన భార్య ప్రవర్తనపై అనుమానాలు వ్యక్తం చేసేవాడు.
Also Read:Sridevi: ‘కోర్ట్’ శ్రీదేవి హీరోయిన్ గా తమిళ చిత్రం
Also Read
- Jasprit Bumrah: బుమ్రా లాంటి బౌలర్ మళ్లీ దొరకడు.. ప్రత్యామ్నాయం లేదు.. కానీ..!
- India-US Trade Deal: భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం తొలి దశ ఖరారు..
- India-US: హిందూ ఆలయంపై దాడికి కుట్ర ఆరోపణలు.. అమెరికాకు భారత్ కీలక విజ్ఞప్తి
- Janasena Leaders Meet Chandrababu: జనసేనలో అంతర్మథనం.. సీట్ల సంఖ్యపై కేడర్ అసంతృప్తి.. మరోసారి చంద్రబాబుతో కీలక భేటీ
కాగా రెండు నెలల క్రితం, దిశాకు, మెకానిక్ ఆసిఫ్ ఇస్లాం అన్సారీ అలియాస్ రాజబాబు టైర్వాలాతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగామారి అక్రమసంబంధానికి దారితీసింది. ఈ వ్యవహారం చంద్రసేన్ రామ్టేకే తెలిసింది. దీంతో వివాదం చెలరేగింది. భర్తను అడ్డుతొలగించుకునేందుకు ప్రియుడితో కలిసి ప్లాన్ చేసింది. చంద్రసేన్ ఇంట్లో నిద్రిస్తున్నప్పుడు దిశ ఆసిఫ్‌ను ఇంటికి పిలిచింది. ఆమె తన భర్తను మంచం మీద నుంచి కిందకి దింపింది. ఆసిఫ్ అతని ముఖంపై దిండును పెట్టి అతను చనిపోయే వరకు ఊపిరాడకుండా చేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు. దిశా మొదట్లో భర్త మరణాన్ని సహజ మరణంగా చిత్రీకరించడానికి ప్రయత్నించగా, పోస్ట్‌మార్టం నివేదికలో అది హత్య అని తేలింది. తరువాత, పోలీసుల విచారణలో ఆమె నేరాన్ని అంగీకరించింది. భర్తలను చంపుతున్న ఘటనలు వరుసగా చోటుచేసుకుంటుండడంతో యువకులు పెళ్లి చేసుకోవాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు.
తాజావార్తలు
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Jasprit Bumrah: బుమ్రా లాంటి బౌలర్ మళ్లీ దొరకడు.. ప్రత్యామ్నాయం లేదు.. కానీ..!
-
Red Magic 12 Pro+: 8400mAh బ్యాటరీతో Red Magic 12 Pro+ రిలీజ్.. 185Hz డిస్ప్లే, 100W ఛార్జింగ్‌తో అదుర్స్!
-
India-US Trade Deal: భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం తొలి దశ ఖరారు..
-
Harish Rao : రైతు బీమా ఇవ్వకుంటే సీఎం ఇల్లు ముట్టడిస్తాం..
ట్రెండింగ్
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..