NTV Telugu Site icon

Big Sale: బ్రాండెడ్ వాచ్‎కు ఆర్డర్ పెడితే.. గ్రాండ్‎గా పేడపెట్టి పంపించారు

Big Sale

Big Sale

Big Sale: దీపావళి సీజన్ సందర్భంగా ప్రస్తుతం ఈ కామర్స్ సంస్థలన్నీ భారీ ఆఫర్లను అందిస్తున్నాయి. ఈ మేరకు బిగ్ సేల్స్ పేరిట కస్టమర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. దీంతో వినియోగదారులు ఉత్తమ డీల్స్‎ను క్యాష్ చేసుకునే పనిలో ఉన్నారు. దీంతో ఆర్డర్ల సంఖ్య పెరిగింది. కానీ పలుచోట్ల వినియోగదారులు తాము చేసిన ఆర్డర్ డెలివరీ వచ్చిన తర్వాత పార్శిళ్లను చూసి ఖంగుతింటున్నారు.

Read Also: MIG 29K Jet Crash: గోవా తీరంలో కుప్పకూలిన మిగ్‌ 29కె యుద్ధ విమానం

ఈ క్రమంలోనే ఓ మహిళ ఆర్డర్ చేసిన వస్తువుకు బదులుగా వచ్చిన పార్శిల్ చూసి షాకైంది. యూపీలోని కౌశాంబి జిల్లాలో ఓ మహిళ బ్రాండెడ్ వాచ్ ఆర్డర్ ఇచ్చింది. కానీ డెలివరీ సమయంలో ఆర్డర్ చేసిన చేతి గడియారానికి బదులుగా ఆవు పేడను అందుకుంది. దీంతో తనకు వచ్చిన పేడను చూపిస్తూ నెట్టింటో ఓ పోస్టును అప్ లోడ్ చేసింది. ఇప్పుడు అది వైరల్ అవుతోంది.

Read Also: Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలకం కానున్న అభిషేక్‌రావు సీబీఐ కస్టడీ

నీలం యాదవ్ ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్‌లో వాచ్ కోసం రూ.1,304 క్యాష్ ఆన్ డెలివరీని ఎంచుకున్నారు. సెప్టెంబరు 28న ఆర్డర్ వచ్చింది. ప్యాక్‌ని తెరిచి చూడగానే అందులో నాలుగు పేడ పిడకలు కనిపించాయి. దీంతో ఆగ్రహించిన ఆమె సోదరుడు డెలివరీ బాయ్‌కి ఫోన్ చేశాడు. వచ్చిన ఆర్డర్ గురించి వివరించాడు. అయితే దీనిపై ఫిర్యాదు చేయాలని డెలివరీ బాయ్ ఏజెంట్‌ను కోరాడు. అలాగే ఆ తర్వాత ఏజెంట్‌కి ఫోన్ చేయగా.. సమస్యకు క్షమాపణ చెప్పి డబ్బులు వాపస్ ఇస్తానని చెప్పాడు.

Read Also: Joe Biden: నాతో మాట్లాడాలనుకుంటే.. పుతిన్‎ను ఒక్కటే అడుగుతా: జో బైడెన్

Show comments