NTV Telugu Site icon

Murder: ఇంటికి రమ్మని భార్య ప్రియుడికి భర్త ఫోన్.. నమ్మి రాగానే నరికేశారు

Friend Murder

Friend Murder

Murder: ఓ మహిళ తన ప్రేమికుడిని భర్త సాయంతో హత్య చేసిన షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. బీహార్‌లోని సుపాల్‌లో జరిగిన ఈ హత్య ఘటన కలకలం రేపింది. ఇక్కడ ఓ వ్యక్తి తన భార్య ఫోన్ నుండి ఆమె ప్రేమికుడిని ఇంటికి పిలిచాడు. భార్యాభర్తలు కలిసి అతడిని హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని నది ఒడ్డున పడేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో ఆ ప్రాంత ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

Read Also: Rahul Gandhi: మోడీపై పరువు నష్టం కేసులో సూరత్ కోర్టుకు రాహుల్ గాంధీ

భపతియాహి పోలీస్ స్టేషన్ పరిధిలోని కోషి నది ఒడ్డున ఉన్న గోపాల్‌పూర్ గ్రామంలో శనివారం ఉదయం 25 ఏళ్ల యువకుడి మృతదేహం లభ్యమైందని సుపాల్ ఎస్‌డిపిఓ కుమార్ ఇంద్రప్రకాష్ తెలిపారు. అతని పేరు ప్రదీప్ సుతిహార్, జగదీష్‌పూర్ గ్రామ నివాసిగా గుర్తించారు. ఈ కేసులో తదుపరి దర్యాప్తులో యువకుడి బంధువు మనోజ్ సుతీహార్ భార్యతో చివరి సారి మాట్లాడినట్లు తేలింది. మహిళను, ఆమె భర్తను విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడ ప్రదీప్ తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని మహిళ భర్త చెప్పాడు.

Read Also: Rashmika: నేషనల్ క్రష్ కూడా లేడీ ఓరియెంటెడ్ చేసేస్తోంది…

ఈ కారణంగా, అతను మార్చి 30 రాత్రి 10:30 గంటల ప్రాంతంలో తన భార్య సిమ్ కార్డు నుండి ఈ యువకుడికి ఫోన్ చేసి ఇంటికి పిలిచాడు. అనంతరం భార్యాభర్తలు ఇనుప సుత్తితో హత్య చేసి మృతదేహాన్ని కోసి నది ఒడ్డున పడేశారు. నిందితులు తమ నేరాన్ని అంగీకరించారని పోలీసు అధికారి తెలిపారు. ఇద్దరినీ జైలుకు పంపారు.