NTV Telugu Site icon

Viral Video: ఏ మాత్రం భయంలేనట్టుంది ఈ పిల్లకు.. ఎంత ఈజీగా పాములను పట్టేసుకుందో..!

Snake

Snake

సాధారణంగా పాములు అంటే అందరికి భయమే.. అవి కనపడితే చూసి చిచ్చు పోసుకునే వాళ్లు చాలా మందే ఉన్నారు. మరికొందరు భయపడకుండా వాటిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. అయితే ఈ వీడియోలో కనిపిస్తున్న మహిళ చేసింది కూడా అలాంటి పనే. అస్సలు భయపడకుండా, బెదరకుండా మెలికలు వేసుకున్న రెండు పాములను పట్టుకుంది. ఈ వీడియోను చూస్తే మీకు గూస్ బంప్స్ రావడం ఖాయం.

Gaddar Passes Away LIVE UPDATES: ప్రజాయుద్ధనౌకగా ప్రజల హృదయాల్లో గద్దర్‌ నిలిచారు: సీఎం కేసీఆర్

ఈ వీడియోలో పాములను చూసిన ఆమె ఒక్కసారిగా కాలువలోకి దిగిపోయి రెండు చేతులతో రెండింటినీ పట్టేసుకుంది. ఒకటి తప్పించుకుని పారిపోతుండగా, తిరిగి పట్టేసుకుంది. వాటిని అదుపు చేయడానికి ఆమె ప్రయత్నం చేయడాన్ని వీడియోలో కనిపిస్తుంది. మన దేశంలోనే ఎక్కడో తెలియదు కానీ.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. సాధారణంగా అయితే విషపాములు కాటు వేస్తాయి. కానీ ఈ మహిళ పట్టుకున్న పాములు తాచు పాములు లేదా విషపూరితమైనవి కానట్టుంది. ఆ పాములను చూస్తుంటే జెర్రిపోతుల్లాగా కనిపిస్తున్నాయి. అవి మనుషులను చూస్తే భయపడి పోతుంటాయి. అందుకోసమని అవి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయే కానీ.. ఆ మహిళపై దాడి చేయడం లేదు.

Bhola Shankar : ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సిద్ధమవుతున్న ‘భోళా శంకర్‌’

మరోవైపు ఈ వీడియోపై పలువును నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. వీడియోను చూసిన కొందరు అభినందిస్తుంటే, కొందరు ఆమె ప్రాణాలకు ప్రమాదం ఏర్పడుతుందేమోనన్న ఆందోళన వ్యక్తం చేశారు. కొందరు యూజర్లు అయితే ఆ పాములను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? అంటూ ప్రశ్నిస్తున్నారు.