Site icon NTV Telugu

Phone Use: ఫోన్‌ ఎక్కువగా వాడుతుందని కూతురిని రాడ్తో కొట్టి చంపిన తల్లి

Crime

Crime

రాజస్థాన్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. ఫోన్‌ ఎక్కువగా వాడుతుందని కూతురిని తల్లి రాడ్తో కొట్టి చంపింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే.. 22 ఏళ్ల నికితా సింగ్, బిందాయక ప్రాంతంలో నివాసం ఉంటోంది. అయితే.. ఆమె పోటీ పరీక్షలకు సిద్ధమవుతుంది. అయితే చదువుకోవడం మానేసి నికితా ఎక్కువ సమయం ఫోన్‌లో గడిపేదని, అందుకే ఆమె ఫోన్ ను రెండున్నర నెలల క్రితం తీసుకున్నట్లు ఆమె తండ్రి తెలిపారు.

Read Also: Samsung Galaxy Ring: శాంసంగ్​ గెలాక్సీ రింగ్​ లాంచ్​ కు రంగం సిద్ధం.. ఫీచర్స్ ఇలా..

అయితే.. తర్వాత కొన్ని రోజుల క్రితం, నికితా తన మొబైల్ ఫోన్ వాడటం తగ్గిస్తానని పేరెంట్స్ కు చెప్పింది. దీంతో.. తల్లిదండ్రులు తిరిగి ఫోన్ ఇచ్చారు. సోమవారం ఉదయం మళ్లీ నికిత ఫోన్ వాడుతుండడం చూసి ఆమె నుంచి ఫోన్ తీసుకున్నారు. తండ్రి భజన్‌లాల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి, దానిని దాచమని తన భార్య సీతకు ఇచ్చి, ఉదయం 8 గంటలకు పని నిమిత్తం బయటకు వెళ్లాడు.

Read Also: Karnataka: త్వరలో సిద్ధరామయ్య సర్కార్ కూలిపోతుంది.. మాజీ సీఎం వ్యాఖ్య

కాగా.. ఫోన్ విషయంమై నికితా, తన తల్లి మధ్య వాగ్వాదం చెలరేగింది. మాటల తూటాలు పెరిగి కోపోద్రిక్తురాలైన తల్లి సీత తన కుమార్తె తలపై రాడ్‌తో కొట్టి చంపింది. తలకు బలమైన గాయం కావంతో నికితా స్పృహ కోల్పోయింది. కాగా.. వెంటనే దగ్గర్లోని స్థానిక ఆసుపత్రికి తీసుకువెళ్లగా.. అక్కడ వైద్యులు ఆమె మరణించినట్లు ప్రకటించారు. ఈ ఘటనపై తల్లిపై పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. మంగళవారం పోస్టుమార్టం అనంతరం నికిత మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ ఘటనపై హత్యకేసు నమోదు చేశాం.. ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదని, పోస్టుమార్టం నివేదిక ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని ఎస్‌హెచ్‌వో భజన్‌లాల్ తెలిపారు.

Exit mobile version