NTV Telugu Site icon

Road Accident: ఆటో కోసం వేచిఉన్నవారిపైకి దూసుకెళ్లిన లారి.. తల్లీబిడ్డ మృతి.. ఇద్దరికి సీరియస్‌

Up Road Accident

Up Road Accident

Road Accident: ఆటో కోసం ఎదురు చూస్తూ.. తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది ఓ ఇల్లాలు.. ఆమెతో పాటు.. రెండేళ్ల తన కూతురు కూడా అక్కడికక్కడే ప్రాణాలు విడిచిన ఘటన ఆంధ్రప్రదేశ్‌లో జరిగింది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తిరుపతి జిల్లా రేణిగుంట సమీపంలోని ఏర్పేడు మండలం ఆమడూరు క్రాస్ వద్ద నిన్న రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. ఆటో కోసం వేచిచూస్తున్న నలుగురు వ్యక్తులపైకి వేగంగా వచ్చిన లారీ దూసుకెళ్లింది.. ఈ ప్రమాదంలో తల్లీబిడ్డలు శారద (22), వైష్ణవి (2) అక్కడికక్కడే మృతిచెందారు.. కార్తీక్‌ అనే నాగుళ్లే బాలుడితో పాటు.. శారద తల్లి విజయమ్మకు స్వల్ప గాయాలు అయ్యాయి.. వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Road Also: Monkeys Attack: దారుణం.. 5 ఏళ్ల బాలుడిపై కోతుల దాడి.. చివరకు

రేణిగుంట మండలం మల్లవరం గ్రామంలోని పుట్టింటికి ఇద్దరు బిడ్డలతో కలసి ఈ నెల 13 న వెళ్లిన శారద. నిన్న సాయంత్రం 6 గంటలకు శారద తల్లి విజయమ్మతో కలసి ఇద్దరు బిడ్డలను తీసుకొని అత్తవారి ఇల్లు అయిన శ్రీకాళహస్తి మండలం రామానుజపల్లికి బయల్దేరింది.. మొదట వెంకటగిరి బస్సు ఎక్కిన శారద. సాయత్రం 7 గంటలకు ఆముడూరు క్రాస్ కు రాగానే బస్సు దిగి రామానుజపల్లికి వెళ్లేందుకు ఆటో కోసం వేచిచూస్తుంది.. ఈ సమయంలో అతివేగంగా తల్లీబిడ్డల పైకి దూసుకెళ్లింది లారీ.. ఘటనా స్థలంలోనే శారద 22, వైష్ణవి 2 మృతి చెందగారు.. ఇక, ఘటన స్థలానికి చేరుకున్న ఏర్పేడు పోలీసులు.. అంబులెన్సులో తీవ్రంగా గాయపడిన కార్తిక్ ను తిరుపతిలోని ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు.. కేసు నమోదు చేసి.. లారీ డ్రైవర్‌ని అదుపులోకి తీసుకున్నారు.. మృతదేహాలను పోస్ట్ మార్ట్రం నిమిత్తం శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు పోలీసులు.

Show comments