Robbery: గుంటూరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోరీ ఘటన కలకలం రేపింది. పట్టణంలోని డీ మార్ట్‌కు కుటుంబ సభ్యులతో వచ్చిన ముత్యాల లక్ష్మి (55) అనే మహిళ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా, గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు ఆమె చేతి బ్యాగ్‌ను లాక్కుని పరారయ్యారు. సరుకులు కొనుగోలు చేసి ఇంటికి వెళ్తున్న మహిళను లక్ష్యంగా చేసుకున్న దుండగులు, రాంగ్ రూట్‌లో వాహనంపై వచ్చి బ్యాగ్ అపహరించి అక్కడినుంచి పారిపోయారు. బ్యాగ్‌లో రూ. 30 వేల నగదు ఉందని బాధితురాలు పోలీసులకు తెలిపారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పట్టాభిపురం పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సీసీ కెమెరా ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. నిందితులను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. దొంగలను పట్టుకోవడానికి పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా విచారణను వేగవంతం చేశారు. ప్రస్తుతం కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితులను త్వరగా గుర్తించి పట్టుకోవడంపై దృష్టి సారించారు. సాధారణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రద్దీ ప్రాంతాల్లో తన విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలని పోలీసులు సూచించారు.
Also Read: AP GOs: ఆంధ్రప్రదేశ్‌లో ఇకపై ప్రభుత్వ ఉత్తర్వులు (G.O.) తెలుగు భాషలో కూడా