Site icon NTV Telugu

Four Legged Baby: నాలుగు కాళ్లతో జన్మించిన శిశువు

Baby

Baby

Four Legged Baby : మధ్యప్రదేశ్ విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఆర్తి కుశ్వాహా అనే మహిళకు జన్మించిన ఆడ శిశువుకు నాలుగు కాళ్లున్నాయి. గ్వాలియర్‌ (Gwalior) జిల్లా సికందర్‌ కాంపూ (Sikandar kampoo) ప్రాంతానికి చెందిన ఆర్తి కుష్వాహ (Aarti Kushwaha) పురుటి నొప్పులతో బుధవారం కమల్‌ రాజ ఆసుపత్రిలో చేరింది. అక్కడ ఆమె పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఆమెకు పుట్టిన పాపకు నాలుగు కాళ్లు ఉన్నాయి. ప్రస్తుతం పసికందు పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. చిన్నారి 2.3 కేజీల బరువు ఉంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.  చిన్నారికి ఉన్న శారీరక వైకల్యాన్ని ఇస్కియోపాగస్ అంటారు. పిండం రెండు భాగాలుగా విభజించబడినప్పుడు, శరీరం రెండు ప్రదేశాల్లో అభివృద్ధి చెందుతుంది. శిశువుకు నడుము కింది భాగం రెండు అదనపు కాళ్లతో అభివృద్ధి చెందింది. అయితే, ఆ కాళ్లు పనిచేయడంలేదు. చిన్నారిని పీడియాట్రిక్‌ డిపార్ట్‌మెంట్‌ వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. శరీరంలో ఇతర వైకల్యం ఏమైనా ఉందా అన్నదానిపై టెస్టులు చేస్తున్నారు. పరీక్షల అనంతరం శస్త్రచికిత్స ద్వారా అదనంగా ఉన్న రెండు కాళ్లను తొలగిస్తారు. అప్పుడు చిన్నారి సాధారణ జీవితాన్ని గడపగలదు’ అని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఆర్‌కేఎస్‌ థకడ్‌ తెలిపారు.

Exit mobile version