NTV Telugu Site icon

Balasore train crash: రైలు ప్రమాదం.. నష్టపరిహారం కోసం బతికున్న భర్తను చంపేసిన మహా ఇల్లాలు

Train

Train

Balasore train crash: ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం ఘటనలో 288మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 1000మందికి పైగా గాయపడ్డారు. ఈ విషాదకర ఘటన వందలాది కుటుంబాల్లో తీరని ఆవేదనను మిగిల్చింది. మరికొందరు అంగవైకల్యం పొంది జీవచ్చవలుగా మారారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు కేంద్రం, రైల్వే శాఖ, ఒడిషా, ఆంధ్రప్రదేశ్ తదితర ప్రభుత్వాలు పరిహారం ప్రకటించాయి. అయితే ప్రభుత్వం ప్రకటించిన పరిహారంకు ఆశపడి కొందరు నకిలీ కుటుంబ సభ్యులు పుట్టకొస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ మహిళ బాగోతం బయటపడింది. వివరాల్లోకి వెళితే.. ఆదివారం కటక్‌కు చెందిన ఓ మహిళ.. బాలాసోర్‌లో రైలు ప్రమాద మృతుల కోసం ఏర్పాటు చేసిన తాత్కాలిక మార్చురీ వద్దకు వచ్చింది. రైలు ప్రమాదంలో తన భర్త చనిపోయాడని చెబుతూ.. మృతదేహాన్ని చూపమని అక్కడి సిబ్బందిని కోరింది. దీంతో వారు ఎన్నో మృతదేహాలను చూపుతూ వెళ్లారు. ఈ క్రమంలో ఓ మృతదేహం వద్ద ఆగిపోయిన ఆ మహిళ ఇది తనకు తాళికట్టిన భర్త తనేనని చెప్పింది.

Read Also:Tejeswi Madivada: ఎద అందాలు,థండర్‌ థైస్‌తో రచ్చ చేస్తున్న తేజస్వి మదివాడ..

నమ్మిన అధికారులు లాంఛనాలు పూర్తి చేసి మృతదేహాన్ని అప్పగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో అక్కడ విధులు నిర్వర్తిస్తున్న బికాస్ కుమార్ పాలే అనే సబ్ ఇన్స్‌పెక్టర్‌‌కు ఆ మహిళపై ఎందుకో అనుమానం వచ్చింది. ఆమె మొహంలో భర్తను కోల్పోయానన్న బాధ కానీ, దిగులు కానీ కనిపించలేదు ఆయనకు వరండాలో చాలా హాయిగా కూర్చొంది. దీంతో బికాస్ వెంటనే ఆమెను కొన్ని వివరాలు అడిగారు. అనంతరం ఆమె చెప్పిన వివరాల ఆధారంగా బరాంబా పోలీసులు ఆరా తీశారు. ఎంక్వైరీలో సదరు మహిళ భర్త బతికే ఉన్నట్లు తేలింది. దీంతో పోలీసులు ఆమెను మందలించడంతో కిలాడీ లేడీ పారిపోయింది. ప్రభుత్వం అందించే సొమ్ము కోసం కొందరు ఇదే తరహాలో ప్లాన్ వేసే అవకాశం వుందని .. అందువల్ల సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఎక్స్‌గ్రేషియాను కాజేయాలని ఆ మహిళ నకిలీ పత్రాలను రూపొందించినట్లు పోలీసుల స్క్రూట్నీలో తేలింది. దీనిపై ఆమె భర్త సైతం ఘాటుగా స్పందించారు. తనకు చాలా అవమానంగా వుందని.. ఇలాంటి మహిళల పట్ల జాగ్రత్తగా వుండాలని ఆయన కోరారు.

Read Also:Jharkhand: గుడిలో పాడుపని చేస్తూ అడ్డంగా దొరికిన ప్రేమజంట..