Site icon NTV Telugu

woman falls into septic tank: సెప్టిక్ ట్యాంక్‌లో పడి 41 ఏళ్ల మహిళ మృతి

Woman Falls Into Septic Tank

Woman Falls Into Septic Tank

woman falls into septic tank: దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని బాంద్రా ఈస్ట్ ఏరియాలో విషాదం చోటుచేసుకుంది. బాంద్రా తూర్పు ప్రాంతంలో 41 ఏళ్ల మహిళ సెప్టిక్ ట్యాంక్‌లో పడి మునిగి చనిపోయిందని బృహన్‌ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ బుధవారం తెలిపింది. ప్రమాదవశాత్తు మహిళ సెప్టిక్ ట్యాంక్‌లో పడిపోయినట్లు పేర్కొంది.

Sonu Sood: సోనూసూద్‌పై నార్త్ రైల్వే ఆగ్రహం.. ఇంకోసారి అలా చేయొద్దంటూ వార్నింగ్

మృతురాలిని నిపుణ శర్మగా గుర్తించారు. బాంద్రాలోని శాస్త్రి నగర్‌లోని సన్‌స్టోన్ బిల్డింగ్‌లో రాత్రి 7:25 గంటలకు ఈ ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. అగ్నిమాపక అధికారులు మహిళను ట్యాంక్ నుంచి బయటకు తీసుకువచ్చారు. వెంటనే ఆమెను గురునానక్ ఆసుపత్రికి తీసుకెళ్లారు, అక్కడ ఆమె చనిపోయినట్లు నిర్ధారించారు.

Exit mobile version