Site icon NTV Telugu

Cuts Off Private Part: భర్త ప్రైవేట్ పార్ట్ కోసిన భార్య… ఆపై యాసిడ్ తాగి ఆత్మహత్యయత్నం..!

Cuts Off Private Part

Cuts Off Private Part

Cuts Off Private Part: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సంభాల్ జిల్లా ఓ గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వివాహిత ఒకరు గొడవల నేపథ్యంలో తన భర్తపై విచక్షణ లేకుండా దాడి చేసి అతడి ప్రైవేట్ పార్ట్ కోసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఆ తర్వాత ఆమె తానే యాసిడ్ తాగి ఆత్మహత్యకు ప్రయత్నించడం ఆ ప్రాంతాన్ని ఉలిక్కిపడేలా చేసింది. అస్మోలీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో ఈ ఘటన జరిగింది. భర్త భార్యల మధ్య పెద్దగా గొడవ జరుగగా, కోపంతో ఉన్న భార్య కత్తితో భర్తపై దాడికి దిగింది. ఆ సమయంలో భర్త ప్రైవేట్ భాగాన్ని కోసింది. తీవ్రంగా గాయపడిన భర్తను కుటుంబ సభ్యులు తొలుత స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లగా, పరిస్థితి విషమంగా ఉండటంతో మురాదాబాద్‌లో ఉన్న పెద్ద ఆసుపత్రికి తరలించారు.

Read Also: WhatsApp Voice Chat: వినియోగదారుల కోసం క్రేజీ అప్డేట్ తీసుకొచ్చిన వాట్సాప్‌.. అసలు ఈ ఫీచర్ ఎల్లా పనిచేస్తుందంటే..?

ఈ దాడి తర్వాత కేవలం కొద్ది నిమిషాల్లోనే భార్య ఇంట్లో ఉన్న యాసిడ్ తాగింది. ఆమె ఆరోగ్య పరిస్థితి కూడా విషమించడంతో ఆమెను జిల్లా ప్రభుత్వాసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం భార్య భర్త ఇద్దరూ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక వీరిద్దరికి నాలుగేళ్ల కిందంట వివాహం జరిగింది. ఇక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళా.. తన భర్త, అత్తగారింటి వారు ఆమెను మానసికంగా వేధించారనీ.. అలాగే కట్నం కోసం అనేకసార్లు హింసించారనీ ఆరోపించింది. అంతేకాకుండా ఆమె సోదరుడు కూడా ఇదే విషయాన్ని చెప్పుకొచ్చాడు. ఎన్నో రోజులుగా జరిగే వేధింపులతో మనస్తాపానికి గురై ఈ దారుణానికి పాల్పడిందని అతడు తెలిపాడు.

Read Also: Realme GT 7: లాంచ్ కాకముందే.. గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సాధించిన రియల్‌మీ GT 7.. ఎలాగంటే?!

అస్మోలీ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్ రాజీవ్ మాలిక్ ఈ ఘటనపై స్పందిస్తూ.. భర్తపై భార్య దాడి చేసిన ఘటనను నిర్ధారించారు. అయితే ఇప్పటివరకు ఎలాంటి ఎఫ్‌ఐఆర్ నమోదు కాలేదని, దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. ఈ సంఘటనతో మరోసారి కట్న వేధింపులపై చర్చ నెలకొంది. ఘటన తీవ్రత దృష్ట్యా ఇరు కుటుంబాలపై కూడా పోలీసుల విచారణ కొనసాగుతోంది.

Exit mobile version