Site icon NTV Telugu

Guatemala: ఏంది అక్కో.. ఏకంగా అగ్నిపర్వతం మీదనే పిజ్జా వండుకొని తింటున్నావ్..

Pizza

Pizza

విహారయాత్రలు చేసేందుకు చాలా మంది ఇష్టపడతారు. చిత్ర విచిత్రమైన ప్రదేశాలు సందర్శించి వస్తుంటారు. అందమైన ప్రకృతితో పాటు దట్టమైన అటవిలోకి వెళ్తుంటారు. ఎత్తైన కొండలు ఎక్కుతుంటారు. అయితే, తాజాగా అలెగ్జాండ్రా బ్లాడ్జెట్ అనే మహిళకు అగ్ని పర్వతం మీద పిజ్జా వండుకుని తినాలనిపించింది. దీంతో ఆమె తన కోరికను తీర్చుకునేందుకు వెళ్లింది. ఆమె వెళ్లడమే కాదు సరదాగా పిజ్జా కూడా అక్కడే తయారు చేసుకుని తినింది.

Read Also: Yashasvi Jaiswal: అరంగేట్రం టెస్టులో 150 పరుగుల మార్క్ దాటిన యశస్వి జైస్వాల్..

అలెగ్జాండ్రా బ్లాడ్జెట్ అనే పర్యాటకురాలు గ్వాటెమాలలో యాక్టివ్‌గా ఉన్న అగ్ని పర్వతంపై ఓ పిజ్జాను వండుకుని తింటున్న వీడియో నెట్టింట వైరల్ గా మారింది. తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లో ఆమె స్వయంగా ఈ వీడియోను పోస్ట్ చేసింది. యాక్టివ్‌గా ఉన్న అగ్ని పర్వతంపై పిజ్జా వండుకుని తినడానికి గ్వాటెమాలకు వెళ్తున్నాను.. అంటే అక్కడ ఉన్నా.. ఆహ్లాదకరమైన ప్రదేశాలు చూడటానికి కూడా అని పేర్కొంది. 2021లో బద్దలైన ఇక్కడి అగ్ని పర్వతం యాక్టివ్‍గానే ఉంది.

Read Also: Gudivada Amarnath: పెళ్లిళ్లు చేసుకోవడంలో పవన్ విప్లవకారుడు.. అది ప్రజలపై రుద్దుతున్నారు..

ఈ నేషనల్ పార్క్‌ లోనికి వెళ్లాలంటే తప్పనిసరిగా ఓ గైడ్ ఉండాల్సిందే. మేము పిజ్జా తయారు చేయడం కోసం ముందుగానే బుక్ చేసుకున్నాము.. అక్కడ బాగా చలిగా ఉంటుంది.. చల్లని గాలులు వీస్తాయనే క్యాప్షన్‌తో అలెగ్జాండ్రా బ్లాడ్జెట్ తన ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ లో పోస్టును షేర్ చేసుకుంది. వీడియోలో ఒక వ్యక్తి కూరగాయలతో వంట చేశాడని పిజ్జాను ట్రేలో ఉంచి అక్కడి నేలపై పెట్టాడు. కొద్దిసేపటి తర్వాత దానిని తీసి ఆమెకు అందించాడు. ఇక అలెగ్జాండ్రా దానిని తింటున్నట్లు మనం ఈ వీడియోలో కనిపిస్తుంది. కాగా.. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌ అవుతుంది.

Exit mobile version