NTV Telugu Site icon

Kakinada Crime: పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం.. చావలేదని ఆస్పత్రి పైనుంచి దూకి ఆత్మహత్య

Kakinada

Kakinada

Kakinada Crime: జీవితంపై విసుగుచెంది కొందరు, నిర్లక్ష్యానికి గురవుతున్నామంటూ మరికొందరు.. ఇతర సమస్యలు ఎంతో మంది ప్రాణాలు తీసుకున్న ఘటనలు చూస్తూనే ఉంటాం.. ఒకసారి ప్రాణాలతో బయటపడ్డారంటే.. మళ్లీ అలాంటి ప్రయత్నాలు చేసిన ఘటనలు చాలా తక్కువే ఉంటాయి.. కానీ, కాకినాడలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన ఓ మహిళ.. చావలేదని ఆస్పత్రి పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది.. జీజీహెచ్‌ ఓపీ బ్లాక్‌పై నుంచి దూకు ప్రాణాలు తీసుకుంది సదరు మహిళ..

Read Also: King Charles Coronation: కింగ్ ఛార్లెస్-3 పట్టాభిషేకానికి మూడు కిరీటాలు.. వీటి ప్రత్యేకత ఇదే..

కాకినాడ డైరీ ఫామ్‌ సెంటర్‌కి చెందిన ఇంద్రజ అనే మహిళ.. తనను భర్త నిర్లక్ష్యం చేస్తున్నాడని ఆవేదనకు గురైంది.. చివరకు చీమల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది.. దీంతో, ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు కుటుంబ సభ్యులు.. చికిత్స నిమిత్తం జీజీహెచ్‌లో చేర్చారు. అయితే, తాను చావలేదని.. ఎలాగైనా ప్రాణాలు తీసుకోవాలనుకుంది ఆ మహిళ.. ఆ తర్వాత జీజీహెచ్‌ బిల్డింగ్ పై నుంచి దూకేసింది.. ఈ సారి అక్కడికక్కడే మృతిచెందింది ఇంద్రజ.. కాగా, రాజ్ కుమార్‌ అనే వ్యక్తితో రెండేళ్ల క్రితం ఇంద్రజకి వివాహం జరిగింది.. ఫోన్‌ చేస్తే ఫోన్ కట్ చేస్తున్నాడని, పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నాడని మనస్థాపానికి గురైన ఇంద్రజ.. ఈ నిర్ణయానికి వచ్చినట్టు చెబుతున్నారు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన కాకినాడ వన్ టౌన్ పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు.

Show comments