Andhra Pradesh Crime: ఆంధ్రప్రదేశ్‌లో ఓ దారుణమైన ఘటన వెలుగు చూసింది.. కన్న కొడుకులు పట్టించుకోవడం లేదు.. కట్టుకున్న భార్యకు భారంగా మారిపోయాడో వృద్ధుడు.. అయితే, వృద్ధాప్యం, అనారోగ్య సమస్యలతో ఏళ్ల తరబడి ఇబ్బంది పడుతోన్న ఆ వృద్ధుడిని చూసుకుంటూ వచ్చిన భార్య.. కొడుకులు పట్టించుకోకపోవడంతో విసుగు చెందింది.. చివరకు భర్తను ఇంట్లోనే సజీవంగా దహనం చేసింది.. స్థానికంగా ఈ ఘటన కలకలం సృష్టిస్తోంది. కట్టుకున్న భార్య ఈ ఘాతుకానికి పాల్పడినా.. కన్న కొడుకుల ప్రవర్తనే ఈ దారుణానికి కారణం అంటున్నారు.
Read Also: YCRCP vs Janasena: వైసీపీ, జనసేన ఫ్లెక్సీ వార్ పీక్స్‌కి..
కర్నూలు జిల్లా పత్తికొండలో జరిగిన ఆ దారుణమైన ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. భర్త హరికృష్ణ(60)కు వృద్ధాప్యంలో సేవ చేయలేక.. అతడు బతికుండగానే నిప్పుపెట్టింది దహనం చేసింది భార్య లలిత.. కొన్నేళ్లుగా అనారోగ్యంతో మంచం పట్టాడు భర్త.. కదలలేని స్థితిలో ఉన్న భర్త హరికృష్ణను ఏళ్లుగా చూసుకుంటుంది.. కానీ, ఇద్దరు కుమారులు వారిని పట్టించుకున్న పాపాన పోయినట్టుగా లేరు.. ఒక కొడుకు కెనడాలో ఉండగా.. మరో కొడుకు స్థానికంగా మెడికల్ షాప్‌ను నిర్వహిస్తున్నారు.. కొడుకులు పట్టించుకోక, తాను కూడా చూడలేని పరిస్థితి నెలకొనడంతో.. ఇంట్లోనే భర్తపై అట్టముక్కలు వేసి నిప్పుపెట్టింది ఆ భార్య.. దీంతో, ఆ వృద్ధుడు సజీవ దహనం అయ్యాడు.. ఆ తర్వాత తానే.. తన భర్తను ఇలా కాల్చివేశానని చెబుతోంది భార్య లలిత.