Site icon NTV Telugu

Woman Beats Husband: మద్యానికి బానిసైన భర్తను క్రికెట్‌ బ్యాట్‌తో కొట్టి చంపిన భార్య

Woman Beats Husband

Woman Beats Husband

Woman Beats Husband: భర్తలు, భార్యలను చిత్రహింసలకు గురి చేయడం, ఇతర చెడు అలవాట్లకు బానిస అవడం లాంటీ కారణాలు ఎవి ఉన్నా భార్యలకు ఒపిక ఉన్నంతవరకే మగవాళ్ల ఆటలు కొనసాగుతాయి. వాళ్లలో ఒపిక, సహనం చచ్చిపోతే మాత్రం భద్రకాళీలా మారి భర్తలనే దారుణంగా చంపేసే పరిస్థితి ఉంటుంది. ఇలా భార్య కోపానికి బలైన ఓ భర్త తనువు చాలించాడు. భర్త మద్యానికి బానిస కావడంతో భార్య దారుణంగా చంపిన ఘటన రాజస్థాన్‌లోని జున్‌జును జిల్లాలో జరిగింది.

Read Also: Accident: గంగోత్రి నుంచి వస్తుండగా లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ఏడుగురు దుర్మరణం

రాజస్థాన్‌లోని జున్‌జును జిల్లాలో ఓ మహిళ తన భర్తను తాగి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు క్రికెట్ బ్యాట్‌తో కొట్టి చంపేసిందని పోలీసులు తెలిపారు. ఆ మహిళను ఆదివారం అరెస్టు చేశారు. ఈ ఘటన జిల్లాలోని బాల్మీకి కాలనీలో శనివారం చోటుచేసుకుంది. కవితా దేవి (35) అనే మహిళ తన భర్త బంటీ బాల్మీకి (40)ని హత్య చేసినట్లు అంగీకరించడంతో అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. రోజూవారీ కూలీ అయిన ఆమె భర్త మద్యానికి బానిసయ్యాడని జుంజును పోలీస్ సూపరింటెండెంట్ శ్యామ్ సింగ్ తెలిపారు. శనివారం బంటీ బాల్మీకి తాగి ఇంటికి తిరిగి వచ్చి అతని భార్యను కొట్టడం ప్రారంభించాడని, ప్రతీకారంగా ఆమె అతనిని క్రికెట్ బ్యాట్‌తో కొట్టిందని పోలీసులు తెలిపారు.ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అతడిని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

Exit mobile version