NTV Telugu Site icon

Madhya Pradesh: అమానుషం.. మహిళను కర్రలతో కొడుతుండగా వీడియో తీస్తున్న జనాలు

Madhya Pradesh

Madhya Pradesh

మధ్యప్రదేశ్‌లో అమానుష ఘటన వెలుగు చూసింది. ధార్ జిల్లాలో మహిళను ఓ వ్యక్తి కర్రతో అందరూ చూస్తుండగా కొడుతున్నాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో.. నలుగురు వ్యక్తులు ఆ మహిళను పట్టుకుని ఉంటే మరొక వ్యక్తి కర్రతో వెనుక భాగాన కొడుతున్నాడు. అయితే.. ఆ మహిళ ఏం పనిచేసిందో తెలియదు కానీ.. నలుగురి చేతిలో నుంచి బయట పడేందుకు ఆమెకు ఎవరూ సాయం చేయలేదు. అంతేకాకుండా.. చూస్తూ ఫోన్లో ఈ ఘటనను రికార్డ్ చేశారు.

Read Also: Hyderabad: TGPSC ఆఫీసు వద్ద ఉద్రికత్త..!(వీడియో)

కాగా.. ఈ వీడియో పోలీసుల కంట పడింది. అది చూసిన పోలీసులు.. కొట్టిన వారిని, ఆ ప్రదేశాన్ని గుర్తించారు. వెంటనే నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో.. నూర్ సింగ్ అనే వ్యక్తిని పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు. కాగా.. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఇతర నిందితుల కోసం గాలిస్తున్నారు.

Read Also: NBK 109 : బాలయ్య మూవీలో కన్నడ స్టార్ నటుడు.. ఫస్ట్ లుక్ పోస్టర్ వైరల్..

ఈ ఘటనపై.. రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ జితు పట్వారీ స్పందిస్తూ, “ధార్ జిల్లాలో జరిగిన ఈ సంఘటన బీజేపీ పాలనలో మహిళల భద్రతపై మరోసారి తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తింది. మహిళలపై అఘాయిత్యాలలో మధ్యప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది!” అని ట్విట్టర్ లో పేర్కొన్నారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్‌ను ట్యాగ్ చేస్తూ.. “ఈ సంఘటనపై తమకు న్యాయం జరుగుతుందని ధార్‌లోని ఈ సోదరీమణులు ఈ ప్రభుత్వం నుండి ఆశించగలరా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో మహిళలపై అరాచకాలు ఎక్కువవుతున్నాయని తెలిపారు. మధ్యప్రదేశ్‌లో మహిళలపై వేధింపులు, నేరాలను అరికట్టడంలో మీ ప్రభుత్వం ఎందుకు విఫలమవుతోంది.? అని జితు పట్వారీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.