NTV Telugu Site icon

Ap Police: ఏపీలో గత ఎన్నికలతో పోలీస్తే ఈ సారి భారీగా పట్టుబడ్డ మద్యం, డ్రగ్స్, సొమ్ము

New Project (7)

New Project (7)

ఎన్నికల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పట్టుబడ్డ సొమ్ము, మద్యం, మత్తు పదార్థాల వివరాలను ఏపీ పోలీసు శాఖ వెల్లడించింది. 2019 ఎన్నికలతో పోల్చితే 2024లో ఏపీలో భారీగా మద్యం, డ్రగ్స్ భారీగా పట్టుబడ్డట్లు తెలిపింది. ఈ మేరకు బుధవారం ప్రెస్ నోట్ విడుదల చేసింది. ఒరిస్సా, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, పాండిచ్చేరి సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. 150 బోర్డర్ చెక్ పోస్ట్ ల్లో పోలీస్, సెబ్, వాణిజ్య పన్నుల శాఖ, రెవెన్యూ, రవాణా శాఖల సమన్వయంతో దాడులు నిర్వహించారు. 35 మొబైల్ పెట్రోలింగ్ పార్టీలు, 15 తాత్కాలిక చెక్ పోస్ట్ లలో నిఘా ద్వారా వీటిని పట్టుకున్నట్టు వెల్లడించింది ఏపీ పోలీసు శాఖ. ఈ ఎన్నికల్లో మొత్తంగా 3466 వాహనాలు సీజ్ చేశారు. గత, ప్రస్తుత ఎన్నికల్లో జప్తు చేసుకున్న సొమ్ము, మద్యం, మాదకద్రవ్యాల వివరాలు కింది విధంగా ఉన్నాయి.

READ MORE: Side effects of smoking: ధూమపానంతో పురుషులు లైంగిక శక్తిని కోల్పోతారా?

నగదు సీజ్: 2019 ఎన్నికలు – రూ.41.80 కోట్లు
2024 ఎన్నికలు – రూ.107.96 కోట్లు
7305 మంది అరెస్ట్

మద్యం సీజ్:- 2019 – రూ.8.97 కోట్ల విలువ మద్యం
2024 – రూ.58.70 కోట్ల విలువ మద్యం
61543 మంది అరెస్ట్

డ్రగ్స్ సీజ్:-2019 – రూ.5.04 కోట్లు విలువ డ్రగ్స్ సీజ్
2024 – రూ. 35.61 కోట్ల విలువ డ్రగ్స్ సీజ్
1730 మంది అరెస్ట్

బంగారం వంటి వస్తువులు:- 2019 – రూ.27.17 కోట్లు సీజ్
2024 – రూ.123.62 కోట్లు సీజ్
42 మంది అరెస్ట్

ఉచితంగా పంపిణీ చేసే వస్తువులు:-
2019 – రూ.10.63 కోట్లు సీజ్
2024 -రూ. 16.98 కోట్లు విలువ సీజ్
233 మంది అరెస్ట్