ధూమపానం ఊపిరితిత్తులపై చెడు ప్రభావం చూపడమే కాకుండా.. శరీరంలోని అనేక అవయవాలపై ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు.     

ముఖ్యంగా ధూమపానం మీ గుండెపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.    

  పొగాకులో ఉండే నికోటిన్ రక్తనాళాలపై ఒత్తిడి పెంచి హృదయనాళ వ్యవస్థను నాశనం చేస్తుంది.  

పొగతాగడం అధిక రక్తపోటు ప్రమాదాన్ని కూడా పెంచుతుంది.  

ధూమపానంతో పురుషులు లైంగిక శక్తిని కోల్పోతారా? అంటే అవుననే అంటున్నారు నిపుణులు.

ధూమపానం సంతానోత్పత్తిపై ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది.

పొగాకులో ఉండే నికోటిన్ పురుషులు, స్త్రీల జననేంద్రియాలలో రక్త ప్రసరణను ప్రభావితం చేస్తుంది.

దీని కారణంగా పురుషులు లైంగిక శక్తిని కోల్పోవచ్చు. 

 ధూమపానం మగ, ఆడ ఇద్దరిలో సెక్స్ హార్మోన్ల స్థాయిలను తగ్గిస్తుంది. లైంగిక కోరికను కూడా తగ్గిస్తుంది.