Pushpa 2: ప్రస్తుతం ఇండియన్ సినిమా మార్కెట్ భారీగా పెరిగిపోయింది. ఒకప్పుడు రూ.100కోట్లు అంటే వామ్మో అనుకునే రేంజ్ నుంచి రూ.1000కోట్ల కలెక్షన్లను సాధించే రేంజ్ కు ఇండస్ట్రీ ఎదిగింది. ఇటీవల కాలంలో బాక్సాఫీస్ వద్ద చాలా సినిమాలు రూ.1000కోట్లను కొల్లగొడుతున్నాయి. ఓ భారీ సినిమా వస్తే రూ.1000కోట్లు గ్యారెంటీ అన్న లెవెల్లోకి మారిపోయిన సంగతి తెలిసిందే. ఇలా బాహుబలి 2 నుంచి మన సౌత్ సినిమాలు రూ.1000 కోట్ల మార్కెట్ కి గేట్లు తెరుచుకోగా.. ఇపుడు మన సౌత్ సినిమా సహా హిందీ సినిమాలో కూడా సరైన సినిమా పడితే రూ.1000 కోట్ల గ్రాస్ మార్క్ అనేది సులభంగానే కొట్టేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
Read Also:Eatala Rajendar: రేపు రాష్ట్రానికి జేపీ నడ్డా.. సభా ప్రాంగణం పర్యవేక్షించిన ఎంపీ ఈటెల..
అయితే ఇపుడు ఇండియన్ సినిమా సహా ఓవర్సీస్ మార్కెట్ లో సత్తా చాటి రూ.1000 కోట్లు మార్క్ అందుకున్న ఇండస్ట్రీలో మన తెలుగు నుంచే అత్యధిక సినిమాలు ఉన్నాయడంలో సందేహం లేదు. నెక్స్ట్ హిందీ, ఆ తర్వాత కన్నడ సినిమాలు ఉన్నాయి. కానీ ఇంకా మా సినిమా ఇండస్ట్రీ ఎప్పుడు 1000 కోట్ల మార్క్ ని కొడతాయని ఎదురు చూస్తున్నారు కోలీవుడ్ ఆడియెన్స్. చాలా ఏళ్ల నుంచి తమిళ్ సినిమాకి రూ.1000 కోట్ల క్లబ్ సినిమా అనేది ఇంకా అందని ద్రాక్ష గానే మిగిలిపోయింది. అన్నీ సెట్ అయితే ఎప్పుడో రోబో 2.0 సినిమాలో శంకర్ అండ్ రజినీకాంత్ లు సెట్ చేయాల్సింది ఉంది. కానీ అది సరైన టాక్ లేక సాధ్యపడలేదు. దీనితో తమిళ సినిమా హైయెస్ట్ గా రూ.800 కోట్ల మార్క్ దగ్గరే ఆగిపోయింది.
Read Also:Komatireddy : సినిమాలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం
ప్రస్తుతం ఇతర సినిమాలు మెయిన్ గా లేటెస్ట్ పుష్ప 2 దెబ్బ చూసి అయితే మరో సినిమా తెలుగు నుంచి రూ.1000 కోట్ల క్లబ్ లో చేరిపోతుంది… మన సినిమా ఎప్పుడు అంటూ తమిళ ఆడియెన్స్ తెగ ఫీలవుతున్నారు. మరి రూ.1000కోట్ల మార్క్ ని కొట్టే పొటెన్షియల్ ఉన్న సినిమా దాదాపు లోకేష్ కనగరాజ్ రజినీకాంత్ సినిమా ‘కూలీ’ కావొచ్చని అభిప్రాయపడుతున్నారు. తమిళులు కోరుకుంటున్న ఈ రూ.1000 కోట్ల మార్క్ ఎప్పటికి టచ్ చేస్తారో చూడాల్సి ఉంది.