కాసేపట్లో మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. సాయంత్రం 6 గంటల నుంచి జంటనగరాల్లో వైన్ షాపులు క్లోజ్ అవనున్నాయి. అంతేకాకుండా.. బార్ అండ్ రెస్టారెంట్లు, కల్లు దుకాణాలు మూసివేయాలని వైన్ షాపులకు పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. కాగా.. హోలీ సందర్భంగా హైదరాబాద్, సైబరాబాద్ తో పాటు రాచకొండ కమిషనరేట్ పరిధిలో మద్యం అమ్మకాలు జరగొద్దని మద్యం దుకాణాలు మూయాలని సూచించారు. మరోవైపు.. స్టార్ హోటల్స్, రిజిస్టర్డ్ క్లబ్బులు యథావిధిగా నడవనున్నాయి. ఈమేరకు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్‌లు ఆదేశాలు జారీ చేశారు.
Read Also: Visakha Drugs Case: విశాఖ డ్రగ్స్ కేసులో సంధ్య ఆక్వా చుట్టూ బిగుస్తున్న వచ్చు
ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి 26న సాయంత్రం (మంగళవారం) 6 గంటల వరకు వైన్ షాపులు, కల్లు దుకాణాలు, రెస్టారెంట్లు క్లోజ్ అవనున్నాయి. అయితే.. కారణమేంటంటే హోలీ వేడుకల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా హోలీ వేడుకలు ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా జరుపుకోవద్దని ప్రజలకు సూచించారు. రోడ్లపై ఇష్టారీతిన వేడుకలు జరుపుకోవద్దని.. అందువల్ల ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని సూచించారు. అలా ఇబ్బందిని కలిగిస్తే చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. రోడ్లపై వెళ్లే వారిపై, వాహనదారులపై రంగులు చల్లితే సీరియస్ యాక్షన్ తీసుకుంటామన్నారు. అంతేకాకుండా.. రోడ్లపై గుంపులు గుంపులుగా తిరగొద్దని తెలిపారు.
Read Also: TheyCallHimOG: రొమాంటిక్ హీరో రగ్గడ్ లుక్.. పవన్ విలన్ అంటే ఆ మాత్రం ఉండాలమ్మ
