Site icon NTV Telugu

Wimbledon 2025: టైటిల్ ఫేవరేట్ సబలెంకకు షాక్.. ఫైనల్ లో అనిసిమోవా..!

Aryna Sabalenka Vs Amanda Anisimova

Aryna Sabalenka Vs Amanda Anisimova

Wimbledon 2025: ప్రస్తుతం లండన్ వేదికగా జరుగుతన్న వింబుల్డన్ ఉమెన్స్ విభాగంలో, టైటిల్ ఫేవరేట్ గా ఉన్న సబలెంక (Aryna Sabalenka)కు షాక్ తగిలింది. సెమిస్ లో అమెరికా ప్లేయర్ అనిసిమోవాపై ఓడి టోర్నీ నుండి నిష్క్రమించింది. దీంతో టైటిల్ రేసులో ఇప్పటివరకు బలమైన ఫేవరేట్ గా నిలిచిన సబలెంక, చివరకు టోర్నీని వీడాల్సి వచ్చింది. ఇక ఈ ఏడాది 3వ గ్రాండ్ స్లామ్ ఫైనల్లో అడుగు పెట్టాలన్న కల నెరవేరలేదు.

Read Also:Siddaramaiah: హైకోర్టులో సిద్ధరామయ్యకు ఊరట.. బీజేపీ వేసిన పరువు నష్టం కేసు నిలిపివేత

ఇక మ్యాచ్ విషయానికొస్తే.. మొదటి సెట్లో తొలి నాలుగు పాయింట్లతో సమానంగా ఉండగా.. ఆ తర్వాత అనిసిమోవా (Amanda Anisimova) బ్రేక్ సాధించి 5-4గా తీసుకెళ్లింది. ఆ తరవాత సర్వీస్ కూడా నిలబెట్టుకోవడంతో, 6-4తో మొదటి సెట్ విజయం సాధించింది. ఇక 2వ సెట్లో సబలెంక పుంజుకుని సెట్ ను కాపాడుకుంది. కానీ 3వ సెట్ లో మళ్లీ వరుస తప్పిదాలు చేసింది. ముఖ్యంగా సర్వీస్ లు, డబుల్ ఫాల్ట్ చేసి గేమ్ పాయింట్స్ అన్నీ అనిసిమోవాకి ఇచ్చింది.

Read Also:Modi Retirement Debate: 75 ఏళ్లకే రిటైర్ కావాలన్న ఆర్ఎస్ఎస్ చీఫ్.. మోడీపై కాంగ్రెస్ సెటైర్లు!

దీంతో వచ్చిన ఛాన్సులను సద్వినియోగం చేసుకున్న అనిసిమోవా 3వ సెట్ కూడా 6-4తో గెలిచి.. కెరీర్లో మొదటిసారి గ్రాండ్ స్లామ్ ఫైనల్ చేరింది. ఇక ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన సబలెంక, సెమిస్ లోనే తన ప్రస్థానాన్ని ముగించింది. మరో గేమ్ లో ఫైనలిస్టుగా స్వీయటెక్ నిలిచింది. ఇదిలా ఉండగా జులై 13న వింబుల్డన్ ఫైనల్ జరగబోతుంది. ఫైనల్ పోరులో నువ్వా.. నేనా.. అన్నట్లు సాగే ఈ మ్యాచ్ లో అనిసిమోవా గెలుస్తుందా..? లేదా స్వయాటెక్‌ గెలుస్తుందా..? అనేది చూడాలి.

Exit mobile version