తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న తాజా మరియు చివరి చిత్రం జన నాయగన్. తెలుగులో జననాయకుడు పేరుతో తీసుకువస్తున్నారు. విజయ్ కెరీర్ లో 69వ గా రానున్న ఈ సినిమాకు H. వినోద్ దర్శకత్వం వహిస్తున్నాడు, బాలీవుడ్ భామ పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్నాడు. విజయ్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ పై ప్రముఖ నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్ నిర్మిస్తుండగా కోలీవుడ్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.
వచ్చే ఏడాది సంక్రాంతి కానుకాగా జనవరి 9న జాననాయకుడు రిలీజ్ కానుంది. అయితే తెలుగులో ఈ సినిమా వర్కువుట్ అవుతుందా అనేది ఇప్పడు టాలీవుడ్ లో గట్టిగా వినిపిస్తున్న టాక్. అందుకు కారణం ఈ సినిమా నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన సినిమా ‘భగవంత్ కేసరి’. శ్రీలీల కీలక పాత్రలో వచ్చిన భగవంత్ కేసరి సినిమాకు రీమేక్ కావడమే. మా సినిమా రీమేక్ కాదని జననాయకుడు టీమ్ ఎంత చెప్పిన ఆ సినిమా నుండి వస్తున్న ప్రతి కంటెంట్ భగవంత్ కేసరిని పోలివున్నాయి. తాజాగా వచ్చిన విజయ్ సినిమా ఫస్ట్ సింగిల్ కూడా బాలయ్య సినిమాలోని ఇచ్చి పాడ్ సాంగ్ ను పోలివుంది. విజయ్, పూజా హెగ్డే అలాగే మమితా బైజు ముగ్గురు భగవంత్ కేసరిలో బాలయ్య, కాజల్, శ్రీలీలలని రిప్రెజెంట్ చేస్తున్నట్టు క్లియర్ గా అర్ధం అవుతుంది. మరి ఇప్పటికే చాలా సార్లు భగవంత్ కేసరిని చూసేసిన టాలీవుడ్ ప్రేక్షకులు జననాయకుడుని చూస్తారా లేదా అని కాస్త డౌటే.
