ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం టీమిండియా పాకిస్థాన్ వెళ్లాలా వద్దా అనేది ఇంకా సస్పెన్స్ గానే ఉంది. అయితే ఈ టోర్నీకి భారత్‌తో పాటు అన్ని జట్లూ పాకిస్థాన్‌కు వస్తాయనడంలో సందేహం లేదని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చీఫ్ మొహ్సిన్ నక్వీ అన్నారు. రాజకీయ సమస్యల కారణంగా భారత్, పాకిస్థాన్‌ల మధ్య చాలా కాలంగా ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదని చెప్పారు. ఈ రెండు జట్లు బహుళ-దేశాల టోర్నమెంట్లలో మాత్రమే ఆడుతున్నాయి. అయితే.. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వాల్సి రావడంతో భారత జట్టు పాకిస్థాన్ వెళ్తుందా లేదా అనే సందేహం నెలకొంది.
Adani Group’s Stocks: షేర్ మార్కెట్లు మరోసారి కుదేలు.. అదానీ గ్రూప్ షేర్లు పతనం..!
చివరిసారిగా 2023 ఆసియా కప్‌కు పాకిస్థాన్ ఆతిథ్యం ఇచ్చింది. కానీ టీమిండియా పాకిస్థాన్ వెళ్లకపోవడంతో ఈ టోర్నీని హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించారు. ఈసారి కూడా హైబ్రిడ్ మోడల్‌లో ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహించవచ్చు.. కానీ పాకిస్తాన్ దానికి ఇంకా సిద్ధంగా లేదు. లాహోర్‌లోని గడ్డాఫీ స్టేడియంలో విలేకరులతో మాట్లాడిన నఖ్వీ.. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం స్టేడియంను సిద్ధం చేయడానికి జరుగుతున్న పునరుద్ధరణ పనుల గురించి తెలియజేశారు. ఏడేళ్ల తర్వాత అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) క్యాలెండర్‌లోకి తిరిగి వస్తున్న ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు పాల్గొనడంపై పీసీబీ ఛైర్మన్‌ను విలేఖరి ఒక ప్రశ్న అడిగారు.
Prakash Raj: 1000 మంది ఆర్టిస్టులున్న సెట్ నుంచి ప్రకాష్ రాజ్ మిస్సింగ్.. కోటి రూపాయల నష్టం!
ఈ ప్రశ్నకు సమాధానం చెబుతూ.. “మేము సిద్ధంగా ఉన్నాము, ఛాంపియన్స్ ట్రోఫీకి అన్ని జట్లు వస్తాయి ” అని మొహ్సిన్ నఖ్వీ చెప్పారు. “భారత జట్టుపై నాకు పూర్తి విశ్వాసం ఉంది… ఇప్పటి వరకు వారు వాయిదా వేయడం, రద్దు చేయడం ఆలోచన లేదు. కాబట్టి అన్ని జట్లు వస్తాయి. ” అని నఖ్వీ తెలిపారు. కొత్తగా ఐసీసీ చైర్మన్‌గా జై షా నియామకమయ్యారు.. ఆయనను కలవాలని అని నఖ్వీని విలేఖరి ప్రశ్నించారు. “షాతో సమావేశాల వివరాలు ఇంకా ఖరారు కాలేదని.” నఖ్వీ తెలియజేశారు.