NTV Telugu Site icon

Imran Khan: దేశాన్ని బానిసగా మార్చిన వారితో రాజీపడబోం.. జైల్లో ఉండేందుకూ సిద్ధమే..

Imran Khan

Imran Khan

Imran Khan: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోసారి ఆర్మీ చీఫ్, షాబాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. పాకిస్థాన్‌ను బానిసలుగా మార్చే వారితో తాను ఎలాంటి రాజీపడబోనని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. 9 ఏళ్లు జైల్లో ఉండేందుకు సిద్ధమన్నారు. దేశాన్ని ‘బానిస’గా మార్చుకున్న వారితో ఎలాంటి రాజీ పడేందుకు నిరాకరించిన ఇమ్రాన్ ఖాన్.. ఇంకా తొమ్మిదేళ్లు జైలులో ఉండేందుకు సిద్ధంగా ఉన్నానని, అయితే ఈ వ్యక్తులతో రాజీపడబోనని అన్నారు. పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) పార్టీ 28వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా శుక్రవారం విడుదల చేసిన సందేశంలో ఖాన్, దేశంపై నియంతృత్వం విధించబడిందని, ఇది ఆర్థిక వ్యవస్థ, న్యాయవ్యవస్థ, పాలన, ప్రజాస్వామ్యం ‘విధ్వంసానికి’ ప్రాతిపదికగా మారిందని అన్నారు. ‘నిజమైన స్వాతంత్య్రం కోసం అవసరమైన త్యాగం చేస్తాను కానీ నా దేశ స్వాతంత్య్రంతో ఎప్పటికీ రాజీపడను’ అని దేశానికి ఇది నా సందేశం అని గత తొమ్మిది నెలలుగా జైలులో ఉన్న ఇమ్రాన్‌ఖాన్ చెప్పాడు. ‘ఇంకా తొమ్మిదేళ్లు జైల్లో ఉండాల్సి వస్తే జైల్లోనే ఉంటాను కానీ నా దేశాన్ని బానిసలుగా మార్చుకున్న వారితో రాజీపడను’ అని అన్నారు.

Read Also: Maruti Suzuki Swift: మారుతీ సుజుకీ స్విఫ్ట్ కి ఎందికింత ఆదరణ..?

ఇటీవలి ప్రతిపాదనలను అనుసరించి బిలావల్ భుట్టో జర్దారీ నేతృత్వంలోని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ లేదా పాలక పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్‌తో పార్టీ చర్చలు జరుపుతుందని పీటీఐ నాయకుడు షెహ్ర్యార్ అఫ్రిది పేర్కొన్న తర్వాత పాకిస్తాన్ మాజీ ప్రధాని నుంచి ఈ సందేశం వచ్చింది. ఆర్మీ చీఫ్, ఐఎస్‌ఐ డైరెక్టర్ జనరల్, ఆర్మీతో మాట్లాడతాం, ఎందుకంటే దేశ భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది’ అని ఆఫ్రిది అన్నారు.