Site icon NTV Telugu

RAPO22 : ఆంధ్రా కింగ్ తాలూకాతో ర్యాపో గట్టెక్కుతాడా..?

Akt

Akt

జోవియల్, లవర్ బాయ్ ఇమేజ్ నుండి సీరియస్ అండ్ మాస్ అవతార్‌లోకి మేకోవరైన రామ్ పోతినేని నాలుగు ఫ్లాప్స్ పడేసరికి యూటర్న్ తీసుకుని ఓల్డ్ లుక్కులోకి మారిపోయాడు. ఆంధ్రా కింగ్ తాలూకాలో వింటేజ్ రామ్‌ కనిపిస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్స్ ఏటైంలో కమిటయ్యాడో కానీ తనలోని హిడెన్ టాలెంట్స్ రైటర్, సింగర్‌ని బయటపెట్టేశాడు రామ్. నవంబర్ 27న ఆంధ్రా కింగ్ తాలూకాతో సాగర్‌గా సగటు సినీ అభిమానిగా పలకరించబోతున్నాడు.

Also Read : Ram Charan : రామ్ చరణ్ – బుచ్చిబాబు ‘పెద్ది’ రిలీజ్ పోస్ట్ పోన్ అవుతుందా?

ఇస్మార్ట్ శంకర్ అండ్ రెడ్ చిత్రాలతో ఊర మాస్ అవతార్‌లోకి ఛేంజైన రామ్‌ని సక్సెస్ ట్రాక్‌ నుండి ఫ్లాఫుల్లోకి నెట్టేశాయి, ద వారియర్, స్కంద, డబుల్ ఇస్మార్ట్ చిత్రాలు. కోలీవుడ్ డైరెక్టర్ లింగు స్వామి, బోయపాటి, పూరీ జగన్నాథ్ స్టార్ డైరెక్టర్స్‌తో కొలాబరేటైన హిట్ 4 ఏళ్లుగా రామ్‌తో దోబూచులాడుతోంది. అందుకే నెక్ట్స్ స్టార్ డైరెక్టర్స్ ని , సీనియర్ దర్శకుల్ని పక్కన పెట్టి మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టితో ఫ్రూవ్ చేసుకున్న దర్శకుడు మహేష్ బాబుతో సినిమాను సెట్ చేశాడు రామ్. ఆంధ్రా కింగ్ తాలూకాలో రామ్ పోతినేనితో ఇప్పటి వరకు ఒక్క హిట్ చూడని భాగ్యశ్రీ బోర్సే జోడీ కట్టింది. అలాగే కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర కీ రోల్ ప్లే చేస్తున్నారు. ఈ సినిమాతో కన్నడ ప్రేక్షకులకు చేరువయ్యేందుకు రామ్ ప్లాన్ చేసుకుంటున్నాడు. కానీ రీసెంట్ గా బెంగళూరులో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ ఈవెంట్లో లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలా ఉందో టేస్ట్ చేశాడు రామ్‌. ఈ ఈవెంట్ తర్వాత కేవలం టాలీవుడ్ మాత్రమే కాదు శాండిల్ వుడ్ ప్రేక్షకులను మెప్పించాల్సిన బాధ్యత రామ్‌పై పడింది. ఇప్పటి వరకు వచ్చిన సాంగ్స్, ట్రైలర్స్ సినిమాపై ఇంటెన్సిటీ క్రియేట్ చేస్తున్నాయి. ఇక రిజల్ట్ ప్రేక్షకుల చేతుల్లోనే ఉంది. ర్యాపోను ఫ్యాన్స్ ఏం చేయబోతున్నారో నవంబర్ 27న తేలిపోనుంది.

Exit mobile version