Site icon NTV Telugu

Ram Charan : రామ్ చరణ్ – బుచ్చిబాబు ‘పెద్ది’ రిలీజ్ పోస్ట్ పోన్ అవుతుందా?

Peddi

Peddi

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది చిత్రానికి సంబంధించిన షాకింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బుచ్చి బాబు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో జాన్వి కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. మేకర్స్ ప్లాన్ ప్రకారం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఎట్టిపరిస్థితుల్లోను 2026 మార్చి 27న ‘పెద్ది’ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఈ సినిమా వాయిదా పడే ఛాన్స్ ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అనుకున్న సమయానికి షూటింగ్ కంప్లీట్ అయ్యేలా లేదట.

Also Read : OTT : ఓటీటీలో ఇంట్రస్టింగ్ కలిగించే మూవీస్ ఇవే

దీంతో పోస్ట్ పోన్ కానుందనే ప్రచారం మొదలైంది. కానీ మెగాభిమానులు ఈ సినిమా పై భారీ ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన పెద్ది ఫస్ట్ షాట్‌తో పాటు చికిరి సాంగ్‌కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ‘చికిరి’ సాంగ్ అన్ని భాషల్లోనూ ఇన్స్టాంట్ చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన చికిరి వైబే కనిపిస్తోంది. మరోవైపు ‘పెద్ది’ నిర్మాతలు ఇప్పటికే నాన్-థియేట్రికల్ డీల్స్ క్లోజ్ చేశారు. అలాగే.. థియేట్రికల్ రైట్స్ కోసం గట్టి పోటీ నెలకొంది. అయినా కూడా పెద్ది వాయిదా తప్పదనేది ఇండస్ట్రీ ఇన్‌సైడ్ టాక్. అయితే, మేకర్స్ నుంచి ఈ విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతానికి ఈ న్యూస్ మాత్రం మెగా ఫ్యాన్స్‌కు కాస్త డిసప్పాయింట్ చేస్తోంది. ఇక ఈ సినిమాలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రలో నటిస్తుండగా.. వెంకట సతీష్ కిలారు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ సమర్పణలో భారీ బడ్జెట్‌తో పెద్ది రూపొందుతోంది.

Exit mobile version