Prabhas The Raja Saab Movie Update: పాన్ ఇండియా స్టార్ ‘ప్రభాస్’ భారీ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి ‘రాజాసాబ్’ షూటింగ్ పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు. వాస్తవానికైతే ఎప్పుడో ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ కావాల్సి ఉంది. కానీ ప్రభాస్ మోకాలి నొప్పితో పాటు ఫౌజీ షూటింగ్ కారణంగా బ్రేక్ పడుతూ వచ్చింది. కొన్ని రోజులు మధ్యలో రెస్ట్ తీసుకున్న డార్లింగ్.. ఇప్పుడు తిరిగి షూటింగ్‌లో జాయిన్ అయ్యారు. రాజాసాబ్ షూటింగ్‌కు ఫినిషింగ్ టచ్ ఇచ్చే పనిలో ఉన్నారు. ప్రస్తుతం రాజాసాబ్‌లోని యాక్షన్ సీక్వెన్స్‌కు సంబంధించిన షూటింగ్ జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఈ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ అయిపోయిన వెంటనే.. సాంగ్స్ షూట్ చేయనున్నారట. ఇక్కడితో సినిమా షూటింగ్ మొత్తంగ కంప్లీట్ కానుంది.
ఎట్టిపరిస్థితుల్లోను రాజాసాబ్ సినిమాను డిసెంబర్ 5న రిలీజ్ చేసి తీరుతామని మేకర్స్ చెబుతున్నారు. కానీ మరోవైపు ఈ సినిమా వాయిదా పడుతుందనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హిందీలో రెండు సినిమాలు రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. దీంతో రాజాసాబ్ వాయిదా పడుతుండడంతోనే.. ఆ సినిమాలు రిలీజ్ అవుతున్నాయనే ప్రచారం జరుగుతోంది. డిసెంబర్ నుంచి పోస్ట్‌పోన్ అయి.. సంక్రాంతికి రాజాసాబ్ రానుందనే టాక్ నడుస్తోంది. కానీ ఇప్పటికే సంక్రాంతికి ‘మెగా 157’ రిలీజ్‌కు రెడీగా ఉంది. అలాగే రవితేజ సినిమాతో పాటు జన నయగన్ కూడా రిలీజ్‌కు రెడీ అవుతోంది. మరిన్ని సినిమాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సంక్రాంతికి రేసు రసవత్తరంగానే ఉంది. కాబట్టి రాజాసాబ్ డిసెంబర్ 5కే వచ్చే అవకాశాలు ఎక్కువ. షూటింగ్ కూడా చివరి దశకు చేరుకుంది. మరి డైరెక్టర్ మారుతి ఏం చేస్తారో చూడాలి.
Also Read: Anushka Shetty Marriage: ఏం జరిగినా.. నేను అతన్నే పెళ్లి చేసుకుంటా!
రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ మారుతి కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ‘రాజాసాబ్’. హారర్ కామెడీ థ్రిల్లర్ జోనర్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో డార్లింగ్ సరసన హాట్ భామలు నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ కథానాయికలుగా నటిస్తున్నారు. సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంను పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. రాజాసాబ్ నుంచి వచ్చిన పోస్టర్స్, గ్లింప్స్, సాంగ్స్, టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
