Site icon NTV Telugu

Nitin Gadkari: 2024 నాటికి అమెరికాకు దీటుగా యూపీ రోడ్లు.. నితిన్‌ గడ్కరీ హామీ

Nitin Gadkari

Nitin Gadkari

Nitin Gadkari: ఉత్తరప్రదేశ్‌లోని రోడ్లను 2024 నాటికి అమెరికాకు దీటుగా తీర్చిదిద్దుతామని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ హామీ ఇచ్చారు. 2024కు ముందే ఈ లక్ష్యాన్ని సాధిస్తామన్నారు. లఖ్‌నవూలో జరిగిన ‘ఇండియన్‌ రోడ్డు కాంగ్రెస్’ 81వ సదస్సులో ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్‌కు రూ.7,000 కోట్ల విలువ చేసే రోడ్డు ప్రాజెక్టులను ప్రకటించారు.

ఉత్తర ప్రదేశ్‌ రోడ్లను అద్భుతంగా తీర్చిదిద్దేందుకు ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం త్వరలోనే రూ.5లక్షల కోట్లు మంజూరు చేయనున్నట్లు గడ్కరీ ప్రకటించారు. అమెరికాకు దీటుగా ఉండేలా రహదారులను నిర్మిస్తామని ఆయన అన్నారు. మంచి రోడ్లను నిర్మించడానికి ప్రభుత్వం దగ్గర నిధుల కొరత ఏమీ లేదన్నారు. భారత్‌లోని రోడ్ల మౌలిక సదుపాయాలు త్వరలోనే అమెరికా తరహాలో ఉంటాయని పేర్కొన్నారు. రోడ్ల నిర్మాణంలో పాల్గొనే అన్ని వర్గాలు చురుకుగా పనిచేయాలని ఆయన అన్నారు. పర్యావరణ పరిరక్షణ, సాంకేతికతతో పాటు పలు అంశాలను దృష్టిలో ఉంచుకుని రహదారుల అభివృద్ధి జరగాలన్నారు. వ్యర్థాల నుంచి రోడ్లను నిర్మించాల్సిన అవసరం ఉందని సదస్సుకు హాజరైన పరిశ్రమ వర్గాలకు పిలుపునిచ్చారు.

Prashanth Kishor: నితీష్‌కు వయసు మీద పడి ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు..

పెట్రోల్‌, డీజిల్‌తో కాకుండా సీఎన్‌జీ, ఇథనాల్, మిథనాల్‌తో నడిచే వాహనాలను వినియోగించాలని నితిన్‌ గడ్కరీ పిలుపునిచ్చారు. అలాగే విద్యుత్తు వాహనాలను కూడా ఉపయోగించాలన్నారు. ఎలక్ట్రిక్‌ వాహనాలు వినియోగించడం వల్ల రవాణా వ్యయాలు తగ్గుతాయన్నారు. మరోవైపు.. లక్నోలోని ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో సమీక్షా సమావేశం నిర్వహించారు గడ్కరీ. యూపీలో జాతీయ రహదారుల నిర్మాణంపై చర్చించినట్లు పేర్కొన్నారు.

Exit mobile version