Site icon NTV Telugu

Illicit Relationship: ప్రియుడితో కలిసి.. భర్తను గొంతు నులిమి చంపిన భార్య.. సంచలన విషయాలు వెలుగులోకి

Arrest

Arrest

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో సంచలనం రేపిన ఆత్మహత్య కేసులో లోతైన దర్యాప్తులో నిజాలు బయటపెట్టారు పోలీసులు. ప్రియుడు, స్నేహితులతో కలిసి భార్య హత్యకు కుట్రపన్నిందని వెల్లడించారు. భర్తను గొంతు నులిమి హతమార్చినట్లు తెలిపారు. వెంగళరావు కాలనీలో ధరవత్ హరినాథ్ (39) హత్య కేసు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్తపై దాడి చేసి గొంతు నులిమి హతమార్చారు నిందితులు. తర్వాత ఉరి వేసి ఆత్మహత్యగా చిత్రీకరించారు.

భార్య దరావత్ శ్రుతిలయ ప్రధాన నిందితురాలుగా పోలీసులు గుర్తించారు. శ్రుతిలయ అటవీ శాఖ బీట్ ఆఫీసర్ గా నిర్ధారించారు. ప్రియుడు కొండా కౌషిక్‌తో శ్రుతిలయ అక్రమ సంబంధం పెట్టుకున్నట్లు తేల్చారు. భర్తను అడ్డుతొలగించుకునేందుకు హత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. హత్యకు సహకరించిన కౌషిక్, మోహన్, భాను మొత్తం నలుగురు నిందితులు. నలుగురిని అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించారు పోలీసులు.

Exit mobile version